దుబాయ్ : పొరపాటున ఖాతాలోకి రూ.1.2 కోట్లు.. తిరిగి ఇవ్వమంటే కుంటిసాకులు, భారతీయుడికి జైలు

తన బ్యాంక్ ఖాతాకు పొరపాటున బదిలీ అయిన 5,70,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ.1.

2 కోట్లు) నగదును తిరిగి ఇవ్వని నేరంలో భారతీయుడికి దుబాయ్ కోర్ట్ నెల రోజులు జైలు శిక్ష విధించింది.అంతేకాదు.

శిక్ష పూర్తయిన తర్వాత అతనిని బహిష్కరించాలని ఆదేశించినట్లు ది నేషనల్ వార్తాసంస్థ నివేదించింది.అయితే డబ్బు తన ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని సదరు బాధితుడు కోర్టుకు తెలిపాడు.

తన బ్యాంక్ అకౌంట్‌లోకి 5,70,00 దిర్హామ్‌లు జమ అయినప్పుడు తాను ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పాడు.ఆ డబ్బును తన అద్దె, ఇతర ఖర్చులకు చెల్లించానని ఆయన తెలిపాడు.

ఈ క్రమంలో ఒక కంపెనీ తనను ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా కోరిందని.అయితే అది వారిదో కాదోనన్న అనుమానంతో తాను నిరాకరించానని ఆ వ్యక్తి కోర్ట్‌కు వివరించాడు.

Advertisement

నిజానికి ఆ డబ్బు ఓ మెడికల్ ట్రేడింగ్ కంపెనీ నుంచి బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడింది.వివరాలను సరి చూసుకోకుండానే సప్లయర్ ఖాతాను పోలిన అకౌంట్‌కు నగదును బదిలీ చేసినట్లు తర్వాత గుర్తించినట్లు కంపెనీ ప్రతినిధులు న్యాయమూర్తికి చెప్పారు.

ఆ వెంటనే తాము భారతీయుడిని సంప్రదించి తమ డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా.అతను నిరాకరించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.దీనిపై అల్ రఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు.

అక్రమంగా డబ్బు సంపాదించారని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది.కేసు నమోదైన నాటి నుంచి భారతీయుడి ఖాతా స్తంభింపజేసినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.

నేరాన్ని అంగీకరించినప్పటికీ.ఈ క్లెయిమ్‌ను పరిష్కరించేందుకు సమయం కోరగా , కోర్ట్ అతని అభ్యర్ధనను తిరస్కరించింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజాగా దుబాయ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై భారతీయుడు అప్పీల్‌ చేసుకోగా.దీనిపై వచ్చే నెలలో విచారణ జరిగే అవకాశం వుంది.

Advertisement

తాజా వార్తలు