మోడీ ఫ‌ట్‌.. ట్రంప్ ఔట్..!

మ‌రో ఇర‌వై రోజుల్లో అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఈ ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన విష‌యం తెలిసిందే.

అందునా.భార‌త్‌కు మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.ప్ర‌పంచానికి పాఠాలు నేర్పిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.

ఈ దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఆయ‌న తీసుకుంటున్న‌నిర్ణ‌యాలు, వేస్తున్న అడుగులు ఆద‌ర్శ‌మ‌ని.బీజేపీ నేత‌లు నిత్యం పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్న విష‌యం తెలిసిందే.

అంతేకాదు, మోడీ త‌ప్ప మ‌రో నాయ‌కుడికి ఇంత రాజ‌కీయ పాట‌వం కూడా లేద‌ని చెబుతున్నారు.దీంతో ఈయ‌న‌నే ఆద‌ర్శంగా తీసుకున్నారు.

Advertisement

ప్ర‌స్తుత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.మ‌రోసారి అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.అగ్ర‌రాజ్యం అధికారాన్నిత‌న‌ద‌గ్గ‌రే పెట్టుకునేందుకు పావులు క‌దుపుతున్న ట్రంప్‌.

అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు.ఈ క్ర‌మంలోనే భార‌తీయ ఓటర్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో భార‌త్‌లో సక్సెస్ అవుతున్నార‌నే ప్రచారం నేప‌థ్యంలో మోడీని త‌న వైపున‌కు తిప్పుకొన్నారు.తాను మోడీ వ్య‌క్తిన‌ని చెప్ప‌డం ద్వారా అమెరికాలోని భార‌తీయ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇప్ప‌టికే భార‌తీయుల‌కు తాను అత్యంత కావాల్సిన వ్య‌క్తిన‌ని, మోడీ త‌న మ‌న‌సు గెలుచుకున్నార‌ని ట్రంప్ త‌న వ్యాఖ్య‌ల‌తో అమెరికాలోని భార‌తీయుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు.ఇక‌, ట్రంప్ ప్ర‌త్య‌ర్థి జో బైడెన్ మాత్రం మోడీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

క‌శ్మీర్ విష‌యం, సీఏఏ అంశాల్లో మోడీ అనుస‌రించిన విధానాల‌ను బైడెన్ తూర్పార‌బ‌ట్టారు.దీంతో బైడెన్‌.

Advertisement

మోడీకి వ్య‌తిరేక‌మ‌ని, ఇది భార‌తీయ అమెరిక‌న్ల‌లో ఆగ్ర‌హం తెప్పించ‌డం ద్వారా.ఖ‌చ్చితంగా త‌న ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని ట్రంప్ ఆశ‌లు పెంచుకున్నారు.

తానే త‌దుప‌రి అధ్య‌క్షుడ‌న‌నే ధీమా కూడా వ్య‌క్తం చేశారు.

క‌ట్ చేస్తే.తాజాగా ఇండియ‌న్ అమెరిక‌న్ యాప్టిట్యూడ్ స‌ర్వే నిర్వ‌హించారు.కేవ‌లం 12 రాష్ట్రాల్లోని 26 ల‌క్ష‌ల మంది భార‌తీయ అమెరిక‌న్ల ఓట్లు ఎటు? అనే విష‌యంపై వారు స‌ర్వే చేశారు.దీనిలో బైడెన్‌కు 72 శాతం ఓట్లు ప‌డ‌గా.

ట్రంప్‌కు కేవ‌లం 22 శాతం ఓట్లు వేశారు ఇండియ‌న్ అమెరిక‌న్లు.దీంతో మోడీ ప్ర‌భావం ఫ‌ట్ అయింద‌ని, ట్రంప్ ఇక ఇంటికేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో చేసిన స‌ర్వేలు నిజం కావ‌డంతో ప్ర‌స్తుతం దీనికి ప్రాధాన్యం ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు