ఖలిస్తాన్ ఉగ్రవాదుల బెదిరింపులు.. కెనడాలో ఘనంగా జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు( 77th Independence Day Celebrations ) మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న భారత రాయబార కార్యాలయాలు, మిషన్‌ల వద్ద ఘనంగా జరిగాయి.

పలు దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక ఖలిస్తాన్( Khalistan ) ఉగ్రవాదుల బెదిరింపుల మధ్యే కెనడాలోనూ జెండా పండుగ ఘనంగా జరిగింది.కెనడాలోని భారతీయ మిషన్‌లలో( India’s Missions ) జాతీయ జెండా రెపరెపలాడింది.

వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం వెలుపల మంగళవారం మధ్యాహ్నం పలువురు నిరసనకారులు ఆందోళనకు దిగడంతో పాటు భారత జాతీయ పతాకాన్ని తగులబెట్టారు.అయితే ఉదయం త్రివర్ణ పతాకావిష్కరణతో పాటు స్వాతంత్య్ర వేడుకలకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వలేదు.

అలాగే ఒట్టావా, టొరంటోలోని భారత కాన్సులేట్ కార్యాలయాల్లోనూ నిరసనకారుల ప్రభావం కనిపించలేదు.స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఖలిస్తానీ గ్రూపులు భారత రాయబారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో వారికి భారీ భద్రత కల్పించింది కెనడా ప్రభుత్వం.

Advertisement

అల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో తొలిసారిగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.వాంకోవర్‌లోని( Vancouver ) భారత కాన్సుల్ జనరల్ మనీష్( Manish ) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అల్బెర్టా ప్రీమియర్ (భారత్‌లో ముఖ్యమంత్రి పదవికి సమానం) డేనియల్ స్మిత్( Danielle Smith ) వేడుకల్లో పాల్గొని ఇండో కెనడియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, విదేశాంగ మంత్రి మెలానీ జోలీ, కేబినెట్ మంత్రి అనితా ఆనంద్ తదితరులు భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.అంతకుముందు మంగళవారం వాంకోవర్‌లోని కాన్సలేట్ కార్యాలయం వెలుపల కొందరు ఖలిస్తాన్ మద్ధతుదారులు భారత వ్యతిరేక నినాదలు చేశారు.

హర్‌దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక ఇండియా వుందని వారు ఆరోపించారు.జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌‌ దారుణహత్యకు గురయ్యాడు.గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

దీని వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.ఆ తర్వాతి నుంచే ఎస్ఎఫ్‌జే బెదిరింపులు పెరిగాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ, టొరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సుల్ జనరల్స్‌‌ను లక్ష్యంగా చేసుకుని ‘‘కిల్ ఇండియా’’ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు