రాజకీయ రంగు పులుముకుంటున్న హీరో విజయ్ పై ఇన్ కమ్ టాక్స్ రైడ్స్

తమిళ ఇండస్ట్రీలో రాజకీయాలతో సమానమైన క్రేజ్ సినిమా నటులకి కూడా ఉంటుంది.అలాగే అక్కడ రాజకీయాలతోనే సినిమా స్టార్ లు కూడా సంబంధాలు కలిగి ఉంటారు.

స్థానిక సామాజిక సమస్యల నుంచి, రాజకీయ సంబంధమైన విషయాల వరకు అన్నింటా సినిమా నటులు స్పందిస్తూ ఉంటారు.అందరికంటే ముఖ్యంగా ఇళయదళపతి అని తమిళ అభిమానులు పిలుచుకునే హీరో విజయ్ సోషల్ సర్వీస్ లో ముందుంటారు.

ఎక్కడ ఎలాంటి ప్రకృతి విపత్థు వచ్చిన ముందుండి సాయం అందిస్తారు.ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తానే సింగిల్ గా బాధితుల దగ్గరకి వెళ్లి సాయం చేసి వచ్దేస్తారు.

ఈ వ్యక్తిత్వం ఆయన అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది.ఇదిలా ఉంటే ఆయన రాజకీయాలలోకి రావాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

అయితే రాజకీయ విషయాలపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద స్పందించే విజయ్ రాజకీయాలలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.అయితే తాజాగా విజయ్ ఇంట్లో ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ అయ్యాయి.

ఇందులో వంద కోట్ల వరకు విజయ్ పన్ను ఎగవేసినట్లు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో అతనిని అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే వీటిలో ఎలాంటి వాస్తవం లేదని మాత్రం తెలుస్తుంది.పన్ను ఎగవేసినట్లు ఆధారాలు దొరికిన అది ఎంత మొత్తం అనేది బహిర్గతం కాలేదు.

అయితే ఈ రైడ్స్ కేవలం విజయ్ మీద బీజేపీ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా చేయించిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.విజయ్ యాంటీ సిఏఏ స్టాండ్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఈ దాడులు జరగడం వెనుక కారణం అదే అనే మాట వినిపిస్తుంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
వేరే హీరో రిజెక్ట్ చేసిన కథలతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ...

విజయ్ నిమ్న కులానికి చెందిన వాడని, అతను రాజకీయాలలోకి వస్తే ఎక్కువ శాతం బడుగు, బలహీన వర్గాలు ఉన్న తమిళనాడులో అతను అధికారంలోకి వచ్చేస్తాడని ఈ కారణంగానే అతనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.అయితే ఇందులో వాస్తవం ఏంటి అనేది విజయ్ వచ్చి చెప్పేంత వరకు తెలియదు.

Advertisement

తాజా వార్తలు