అన్న పార్టీ నేతల కోసం తమ్ముడి ఎదురుచూపు ?

సీఎం కుర్చీ ఎక్కాలనే కుతూహలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో అమాంతం పెరిగిన జనసేన ప్రభావం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందని, కచ్చితంగా ఏపీలో కీలక స్థానం జనసేనకు  దక్కుతుందనే నమ్మకం తో పవన్ ఉన్నారు.

ఈ మేరకు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఈసారి కసి గా ఉన్నారు.జనసేన ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే,  రాజకీయంగా పార్టీని మూసుకోవాలసిన పరిస్థితి ఉంటుందనే ఒక అంచనాకు వచ్చేశారు.

ఈ మేరకు పవన్ కూడా అలెర్ట్ అవుతున్నారు.ఇప్పటికే బీజేపీ,  టీడీపీ వంటి పార్టీల పొత్తుల వ్యవహారం జనసేన కు తలనొప్పిగా మారింది.

  జనసేన తో పొత్తు కొనసాగించేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే , పవన్ పై ఒత్తిడి పెంచుతోంది.అలాగే టిడిపి కూడా తమతో పొత్తు పెట్టుకోవాలని రాయబారాలు పంపుతోంది.

Advertisement

ఈ పొత్తుల సంగతి పక్కన పెట్టి,  పూర్తిగా జనసేన బలం పెంచుకునే అంశం పైనే ప్రస్తుతం పవన్ దృష్టి పెట్టారు.ఈ నేపథ్యంలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పని చేసేవారి పై పవన్ చూపు పడింది.

వీరి లో చాలా మంది రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు.కొంతమంది కాంగ్రెస్,  వైసిపి, టిడిపి వంటి పార్టీలలో చేరి పోగా , మరికొంత మంది తటస్థంగా ఉండిపోయారు.

అటువంటి కీలక నేతలు అందరినీ రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి,  వారిలో బలమైన వారిని, గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన వారిని గుర్తించి, అటువంటి వారందరినీ చేర్చుకోవాలని పవన్ ఉబలాట పడుతున్నారు. 

   ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది .రాబోయే ఎన్నికల నాటికి ఇది మరింత తీవ్రతరం అవుతుందని పవన్ అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఏపీలో టీడీపీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది జనాలు చూశారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

దీంతో  రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తమకే అవకాశం కల్పిస్తారనే నమ్మకం పెట్టుకున్నారు.అందుకే వీలైనంత ఎక్కువమంది నాయకులను పార్టీలో చేర్చుకునే విషయం పైనే దృష్టిపెట్టలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు పవన్ ఆదేశాలు జారీ చేశారట .అలాగే కాపు, బిసి సామాజిక వర్గాలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవాలని,  సూచించారట.జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించే ఆలోచనలోనూ పవన్ ఉండడంతో,  ఆ సభలోనే భారీఎత్తున చేరికలు ఉండేలా జనసేన ప్లాన్ చేసుకుంటోంది.

Advertisement

   .

తాజా వార్తలు