Mukesh Kumar Meena : ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ( Mukesh Kumar Meena )జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అధికారుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎలాంటి హింసాత్మక సంఘటనలు రీపోల్ కు చోటు లేని ఎన్నికలే లక్ష్యం కావాలని.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.2024 సాధారణ ఎన్నికల నిర్వహణ, సంసిద్ధత, చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Mukesh Kumar Meena : ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్�

కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) నోటిఫికేషన్ జారీ చేయగానే మోడల్ కోడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.నగదు, మద్యం రవాణా, మెటల్ వస్తువుల రవాణా పై నిఘా పటిష్టం చేయాలన్నారు.ఎంసిఎంసి, ఫ్లయింగ్, సర్వే లైన్స్, వీడియో, పోలీస్ బృందాలు 24/7 ప్రకారం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఓ నెల రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు.ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయి ఎన్నికల ప్రశాంతంగా జరగాలని సూచించారు.

Advertisement
Mukesh Kumar Meena : ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్�

ఇప్పుడు ఆ రకంగానే ఏపీ సీఈఓ.జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది.

రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన సీతమ్మ వాకిట్లో.. మూడు రోజుల కలెక్షన్ల లెక్కలివే!
Advertisement

తాజా వార్తలు