ప్రభుత్వ పాఠశాల స్వీపర్ల వేతనాలు రూ. 27 వేలకు పెంచాలి: ఐ.ఎఫ్.టి.యు

సూర్యాపేట జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు తమ వేతనాలు పెంచాలని గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఐ.ఎఫ్.

టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంటా నాగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వీపర్ల సమ్మెకు గురువారంఐ.

ఎఫ్.టి.యు,ఏ.ఐ.కె.ఎమ్.ఎస్, పి.డి.ఎస్.యు సంఘాలు మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా స్వీపర్లు రూ.1600 లకే పని చేస్తున్నారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే వేతనం చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.చాలీచాలని వేతనాలు చెల్లిస్తూ ఫుల్ టైం పని చేయించుకుంటూ వెట్టి చాకిరికి గురిచేస్తున్నారని,శ్రమకు తగిన వేతనాలు కేసీఆర్ ప్రభుత్వం చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.

కనీస వేతనాలను విద్యాసంస్థలలో పనిచేస్తున్న వర్కర్లకు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఆ తీర్పులను ప్రభుత్వాల ధిక్కరిస్తూ స్వీపర్లతో హీనమైన పనులు చేయించుకుంటున్నారని మండిపడ్డారు.పిఎఫ్, ఈఎస్ఐ,ప్రమాద బీమా, ఉద్యోగ భద్రతకు అతీగతీ లేదన్నారు.ఇచ్చే రూ.1600 జీతాలకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తూ నిర్బంధ పనిని చేయించుకోడం ఏమిటని ప్రశ్నించారు.నేడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్లీపర్లకు కనీస వేతనం రూ.27 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకేఎంఎస్ డిజన్ ప్రధాన కార్యదర్శి అల్గుబెల్లి వెంకటరెడ్డి,పి.

డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్,స్వీపర్ల జిల్లా అధ్యక్షులు నార్ల పరశురాములు,ప్రధాన కార్యదర్శి ఎస్కే రసూల్, గౌరవ సలహాదారులు చిక్కుల వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు జానకి,కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News