వారానికి 2 సార్లు ఈ జ్యూస్ ను తాగితే మధుమేహం, గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు!

ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మధుమేహం, గుండె జబ్బులు( Diabetes , heart disease ) బారిన పడుతున్నారు.

ఇవి ఒక మనిషిని శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీస్తాయి.

అందుకే ఏదైనా సమస్య వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.ఈ నేపథ్యంలోనే గుండె జబ్బులు మరియు మధుమేహం రిస్క్ ను తగ్గించే ఒక అద్భుతమైన జ్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు( Carrot slices ) వేసుకోవాలి.అలాగే నాలుగు నుంచి ఐదు కీర దోసకాయ స్లైసెస్ మరియు గింజ తొలగించి సన్నగా తరిగిన ఒక ఉసిరికాయ( Amla ) వేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.

Advertisement

ఈ కీరా క్యారెట్ ఆమ్లా జ్యూస్ ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.వారానికి రెండు సార్లు కనుక తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

కీరా క్యారెట్ ఆమ్లా జ్యూస్ యాంటీ డయాబెటిక్( Anti-diabetic ) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.అందువల్ల ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.అలాగే ఈ జ్యూస్ విటమిన్ సి యొక్క అత్యంత సంపన్నమైన సహజ మూలం.

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

కీరా క్యారెట్ ఆమ్లా జ్యూస్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ధమనులు మరియు సిరలలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Advertisement

అంతేకాదు ఈ జ్యూస్ ను వారానికి రెండు సార్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.కంటి చూపు పెరుగుతుంది.

శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరియు అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి కూడా కీరా క్యారెట్ ఆమ్లా జ్యూస్ అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

తాజా వార్తలు