నాగ పంచమి రోజున ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే పాములు మనుషులకు చేసే మేలు అంతా ఇంతా కాదు.పర్యావరణ సంతులానానికి ఆ జీవి సైతం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.

ఆ పాములను నాగదేవతగా భావించి చాలామంది ప్రజలు పూజలు కూడా చేస్తూ ఉంటారు.సనాతన ధర్మంలో ఏడు రకాల పాముల గురించి ప్రస్తావించారు.

వీటిని పూజించడం ద్వారా మనిషి జీవితంలో ఆనందం, అదృష్టాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం( Shravana Masam )లోని శుక్లపక్షం రోజులలో వచ్చే నాగ పంచమిని పవిత్రమైన పండుగగా భావించి నాగదేవతను పూజిస్తూ ఉంటారు.

If You Do This Onnaga Panchami Your Wishes Will Surely Come True.. , Naga Panch

నాగ పంచమి( Naga Panchami ) రోజున పాములను ఎవరైనా నియమా నిబంధనల ప్రకారం పూజిస్తే జీవితానికి సంబంధించిన సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రజలను నమ్ముతారు.నాగ పంచమి ఆరాధన వలన పాము కాటుతో సహా అన్ని భయాలు తొలగిపోతాయని చాలామంది ప్రజల విశ్వాసం.నాగ పంచమి రోజు సర్పరాజునీ పూజించి పుణ్య ఫలితాలను పొందడానికి రుద్రాక్ష జపమాలలో ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తినాగః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అనీ పండితులు చెబుతున్నారు.

If You Do This Onnaga Panchami Your Wishes Will Surely Come True.. , Naga Panch
Advertisement
If You Do This OnNaga Panchami Your Wishes Will Surely Come True..! , Naga Panch

హిందూ విశ్వాసం ప్రకారం సర్పాలకు సంబంధించిన మంత్రాలలో దేనినైనా జపిస్తే పాముకాటు అనే భయం ఉండదు.భక్తి విశ్వాసంతో నాగదేవత మంత్రాన్ని పాటించడం ద్వారా వ్యక్తి అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతాడు.అంతే కాకుండా జీవితంలో అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తాడని నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే నాగపంచమి రోజున నాగుల దేవాలయాన్ని సందర్శించడం, నాగ దేవతలను పూజించడం మంత్రాన్ని పాటించడం శుభ ఫలితాలను తెస్తుంది.కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి.నాగపంచమి రోజున నాగ దేవతలకు పాలాభిషేకం చేస్తూ మంత్రాన్ని పఠిస్తే తరగని పుణ్యం లభిస్తుంది.

ఇంకా చెప్పాలంటే నాగ సర్పదేవుడి మంత్రాన్ని జపించడం వల్ల వ్యక్తి జాతకంలో రాహు కేతువు( Rahu Ketu )కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు