కాంగ్రెస్‎ను నమ్మితే మోసపోతాం..: మంత్రి హరీశ్ రావు

నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్ధతుగా మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు.

మిత్తితో సహా మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.బోర్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.28 వేల కోట్లు నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.కేసీఆర్ ఎల్లప్పుడూ రైతులు పక్షానే నిలబడ్డారన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే వస్తుందని తెలిపారు.

కేసీఆర్ వచ్చాక పేకాట క్లబ్బులు లేకుండా చేశారన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ గల్లీకొక పేకాట క్లబ్ వస్తుందన్నారు.ప్రియాంక యూపీలో తిరిగితే కాంగ్రెస్ రెండు సీట్లే గెలిచిందని విమర్శించారు.

కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతామని స్పష్టం చేశారు.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు