నేడు జరిగే భారత్-శ్రీలంక మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఫైనల్ లో పాకిస్తాన్ తో పోరు..!

ఆసియా కప్( Asia Cup ) లో సూపర్-4 మ్యాచులలో భాగంగా నేడు భారత్- శ్రీలంక మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ ప్రారంభమైంది.

అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్( Pakistan ) పై భారత్ భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

అయితే శ్రీలంక, పాకిస్థాన్ జట్లు కూడా రెండు పాయింట్లు తోనే ఉన్న రన్ రేట్ కారణంగా భారత్ అగ్రస్థానానికి వెళ్ళింది.

ఈ స్థితిలో నేడు జరిగే భారత్-శ్రీలంక మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.కాబట్టి నేడు జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.నేటి మ్యాచ్ లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ గెలిస్తే.

భారత్, శ్రీలంక, పాకిస్తాన్ లలో రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడే అవకాశాలు ఎక్కువ.

Advertisement

మరోవైపు బంగ్లాదేశ్( Bangladesh ) పై శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.కాబట్టి భారత్, శ్రీలంక రెండు జట్లు కీలకమైన రెండు పాయింట్లపై దృష్టి సారిస్తుండడంతో నేడు జరిగే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది.ఇక నేడు జరిగే మ్యాచ్ కాకుండా సూపర్-4 దశలో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.

సెప్టెంబర్ 14వ తేదీ పాకిస్తాన్- శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.సెప్టెంబర్ 15వ తేదీ భారత్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.అయితే రెండు మ్యాచ్లలో ఓడిన బంగ్లాదేశ్ ఫైనల్ కు అర్హత సాధించడం కష్టమే.

కాబట్టి భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లలో రెండు జట్లు ఫైనల్లో తలపడే అవకాశం ఉంది.ఇందులోనూ భారత్ ,పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు