అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు తర్పణం వదిలితే..?

వైశాఖ మాసం, మే నెలలో వచ్చే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి.

ఈ అక్షయ తృతీయ రోజు పరుశురాముడు జన్మించాడని,అదే విధంగా పవిత్రమైన గంగాజలం భూమిని తాకినది కూడా ఈ అక్షయ తృతీయ రోజేనని, త్రేతాయుగం మొదలైనది కూడా అక్షయ తృతీయ రోజు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా శ్రీ లక్ష్మీ విష్ణుమూర్తిలకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.అక్షయ తృతీయ రోజు ఉదయమే అమ్మవారికి పెద్దఎత్తున పూజలను నిర్వహించి ఆవు నెయ్యితో దీపారాధన చేసే అమ్మవారికి పాయసం, పొంగలి రవ్వ కేసరి వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మన ఇంటి ఆవరణంలో లేదా పొలంలో విత్తనాలను నాటడం లేదా మొక్కలను నాటడం సాంప్రదాయంగా వస్తుంది.శివుని ప్రార్థించిన కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు రక్షకుడిగా నియమింపబడిన దినం కూడా అక్షయ తృతీయ కనుక అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున మహాలక్ష్మికి పూజలను నిర్వహిస్తారు.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మంచిదని చెబుతుంటారు.ఈ విధంగా బంగారం కొనడం ద్వారా అది ఎప్పుడు తరగకుండా మన సంపద పెరుగుతుందని భావిస్తారు.

Advertisement

అయితే అక్షయ తృతీయ రోజు మన స్తోమతను బట్టి కొనడంలో తప్పులేదు కానీ అప్పుచేసి బంగారం కొనకూడదు.ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు తర్పణం చేయడం ద్వారా వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

అదేవిధంగా అక్షయ తృతీయ రోజు గోదానం చేయడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు