ఎంపీ కేశినేని నానికి విశ్వాసం లేదు..: కేశినేని చిన్ని

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ కేశినేని నానికి( MP Keshineni nani ) విశ్వాసం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో నాని మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని తెలిపారు.అవినాశ్( Avinash ) కు కేశినేని నాని ముఖ్య అనుచరుడిగా మారారని కేశినేని చిన్ని ఆరోపించారు.

ఈ క్రమంలోనే కేశినేని నానికి వైసీపీలో టికెట్ వస్తుందో రాదో కూడా తెలియదని వెల్లడించారు.

రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ - జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.అయితే ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబును( Chandrababu ) టార్గెట్ గా చేస్తుంటే.మరోవైపు టీడీపీ నేతలంతా నానిని టార్గెట్ చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు హీటెక్కాయి.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు