కరోనా కోసం వందేళ్ల నాటి చికిత్స. వైపు మొగ్గు చూపుతున్న డాక్టర్లు,వర్కౌట్ అయ్యేనా!

ఎప్పుడో వందేళ్ల క్రితం వాక్సిన్లు ఏమీ అందుబాటులో లేని సమయంలో అంటువ్యాధులు అరికట్టేందుకు ఒక పద్దతిని పాటించేవారు.

అయితే ఇప్పుడు ఆ పద్దతి తోనే కరోనా మహమ్మారి ని కట్టడిచేయాలని అగ్రరాజ్యం ఒక ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

వందేళ్లనాడు వ్యాక్సిన్లు వంటివి ఏవీ అందుబాటులో లేని సమయంలో అంటువ్యాధులు అరికట్టేందుకు రోగాల నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మా ను సేకరించి బాధితులకు ఎక్కించి వ్యాధిని నయం చేసేవారు.అయితే ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలను అల్లడిస్తున్న కరోనా వైరస్ ను కూడా అరికట్టడానికి ఈ వైరస్ బారి నుంచి బయటపడిన వారి రక్తం నుంచి ప్లాస్మా ను సేకరించి కరోనా తో బాధపడుతున్న వారికి ఎక్కించి నయం చేయాలనీ చూస్తున్నారు.

ఎప్పుడో వందేళ్ల నాటి చికిత్స ను ఇప్పుడు ఉపయోగించి కరోనా ను నియంత్రించవచ్చని కొందరు వైద్యులు భావిస్తున్నారు.అయితే కరోనా పనిపట్టేందుకు ఈ చికిత్స ఉపకరిస్తుందో లేదో తెలుసుకునేందుకు అమెరికా ఆసుపత్రులు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఎఫ్‌డీఏ అనుమతికి ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా,అనుమతి లభించగానే పరీక్షలు ప్రారంభమవ్వనున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ చికిత్స గనుక సక్సెస్ అయితే మాత్రం రెండు లాభాలు ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

ప్రస్తుతం రోగంతో బాధపడుతున్న వారిని కోలుకునేలా చేయడంతో పాటూ కొత్త వారికి కరోనా సోకకుండా ఉండేందుకు ఈ చికిత్స ఓ తాత్కాలిక వ్యాక్సిన్‌లా ఉపయోగపడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ చికిత్స ఆశించిన ఫలితాన్ని ఇస్తుందన్న గ్యారెంటీ మాత్రం ప్రస్తుతానికి ఇవ్వలేమని వైద్యులు అంటున్నారు.

మరి ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం తప్పకుండా ఈ కరోనా కు ఒక అడ్డుకట్ట వేసే అవకాశం దొరుకుతుంది.మరోపక్క ఈ కరోనా మహమ్మారి తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 20 వేలకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.రోజు రోజుకు ఈ కరోనా మరణాలు పెరుగుతుండడం తో చాలా దేశాలు లాక్ డౌన్ ను కూడా ప్రకటించాయి.

Advertisement

తాజా వార్తలు