మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) కూడా ఒకటి.

ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.అయితే కొన్ని వారాల గ్యాప్ లో మూడు సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మతలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ మూడు సినిమాలు మైత్రీ నిర్మాతలకు లాభాలను అందిస్తాయో నష్టాలను అందిస్తాయో చూడాల్సి ఉంది.

అయితే మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం పడనుందని తెలుస్తోంది.రాబిన్ హుడ్ సినిమా( Robinhood Movie ) ఏకంగా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా విషయంలో 25 కోట్ల రూపాయల థియేట్రికల్ రిస్క్ ఉంది.

బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ( Good Bad Ugly Movie ) కూడా మైత్రీ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా అనే సంగతి తెలిసిందే.

Huge Burden On Mythri Movie Makers Producers Details, Mythri Movie Makers, Mythr

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ కాంబో మూవీ 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమాలకు సంబంధించి 200 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ కలెక్షన్లు రావాల్సి ఉంది.

Huge Burden On Mythri Movie Makers Producers Details, Mythri Movie Makers, Mythr

ఈ రెండు సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.మైత్రీ నిర్మాతలు ఒక విధంగా బిగ్ రిస్క్ చేశారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Huge Burden On Mythri Movie Makers Producers Details, Mythri Movie Makers, Mythr

మైత్రీ మూవీ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టిస్తే రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ కు తిరుగుండదని చెప్పవచ్చు.పుష్ప ది రూల్ సినిమా మైత్రీ నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్న నంబర్ వన్ బ్యానర్ ఏదనే ప్రశ్నకు మైత్రీ మూవీ మేకర్స్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.

తాజా వార్తలు