జీర్ణ వ్యవస్థ బలంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే!

ఇటీవ‌ల కాలంలో ఎంద‌రినో గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ వేధిస్తున్నాయి.ఎన్ని మందులు వాడినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

జీర్ణ వ్య‌వ‌స్థ బ‌లహీనంగా ఉన్న‌ప్పుడే ఆ జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అందుకే జీర్ణ వ్య‌వ‌స్థను ఎప్పుడూ బ‌లంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

అయితే అలా ఉండాలీ అంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటీ.? అన్న‌ది ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Digestive System, Strong Digestive System, Health Tips, Good Health, Latest News

సాధార‌ణంగా కొంద‌రు ఆహార‌న్ని ఎప్పుడూ చ‌ల్ల‌ చ‌ల్ల‌గా తీసుకుంటారు.కానీ తాజాగా, వేడిగా ఉండే ఆహార‌మే తీసుకోవాలి.వేడిగా ఉన్న ఆహారం శరీరంలో సులభంగా జీర్ణం అవుతుంది.

Advertisement
Digestive System, Strong Digestive System, Health Tips, Good Health, Latest News

త‌ద్వారా జీర్ణ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డ‌కుండా ఉంటుంది.అలాగే కొంద‌రు ఆక‌లి వేసిన వెంట‌నే ఆహారం తీసుకోరు.

అర‌గంట‌, గంట త‌ర్వాత తింటుంటారు.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా జీర్ణ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డుతుంది.

అందుకే ఆక‌లి వేసిన వెంట‌నే ఆహారం తీసుకోవాలి.ఆ ఆహారం కూడా పోష‌కాహార‌మై ఉండాలి.

అప్పుడే జీర్ణ వ్య‌వ‌స్థ‌ బ‌లంగా ఉంటుంది.శ‌రీరానికి స‌రిప‌డా నీరు అంద‌క‌పోవ‌డం వ‌ల్ల సైతం జీర్ణ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డి పోతుంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ప‌ది నుంచి ప‌న్నెండు గ్లాసుల వాట‌ర్‌ను త‌ప్ప‌ని స‌రిగా తీసుకుంటే శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.అదే స‌మ‌యంలో జీర్ణ వ్య‌వ‌స్థ‌ స్ట్రోంగ్‌గా ఉంటుంది.

Digestive System, Strong Digestive System, Health Tips, Good Health, Latest News
Advertisement

కొంద‌రు ఆహారాన్ని స‌రిగ్గా న‌మ‌ల‌కుండా త్వర‌త్వ‌ర‌గా తినేస్తుంటారు.ఇలా చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌పై ఒత్తిడి ప‌డి.బ‌ల‌హీనంగా మారిపోతుంది.

అందుకే, ఏ ఆహారం తీసుకున్నా.బాగా న‌మిలి న‌మిలి మింగాలి.

ఇక జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా ఉండాలంటే ఫైబ‌ర్ ఎంతో ముఖ్యం.అందుకే ప్ర‌తి రోజు డైట్‌లో ఫైబ‌ర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.

తాజా వార్తలు