ఈ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను రోజూ వాడితే క్లియ‌ర్ స్కిన్ మీసొంతం!

సీజ‌న్ ఏదైనా చ‌ర్మానికి త‌ప్ప‌ని స‌రిగా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఏది యూజ్ చేసినా, చేయ‌క‌పోయినా రెగ్యుల‌ర్‌గా చ‌ర్మానికి మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడాలి.

అప్పుడే స్కిన్ హెల్తీగా ఉంటుంది.అయితే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే కొన్ని మాయిశ్చ‌రైజ‌ర్స్‌లో కెమిక‌ల్స్ నిండి ఉంటాయి.

ఇవి చ‌ర్మానికి తీవ్ర హానిని క‌ల‌గ‌జేస్తాయి.ఇలాంటివి వాడి లేనిపోని స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకునే బ‌దులు.

ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మాయిశ్చ‌రైజ‌ర్‌ను త‌యారు చేసుకుని వాడితే క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్‌, మూడు టేబుల్ స్పూన్ల షియా బ‌ట‌ర్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్‌, మూడు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి.

ఇప్పుడు అన్నీ క‌లిసేలా విస్క‌ర్ సాయంతో మిక్స్ చేసుకుంటే.న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్ సిద్ధ‌మైన‌ట్టే.ఒక చిన్న బాక్స్ తీసుకుని.

అందులో త‌యారు చేసుకున్న మాయిశ్చ‌రైజ‌ర్‌ను నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రెండు నుంచి మూడు వారాల పాటు వాడుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం ముఖానికి ఈ మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేసుకుని.

రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖ చ‌ర్మం స్మూత్‌గా మారుతుంది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.స్కిన్ క్లియ‌ర్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.

Advertisement

అంతే కాదు, ఈ న్యాచుర‌ల్ మాయిశ్చరైజ‌ర్‌ను వాడితే ముడ‌త‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.ఒక‌వేళ ఉన్నా.

అవి క్ర‌మంగా మాయం అవుతాయి.కాబ‌ట్టి, మార్కెట్‌లో దొరికే కెమిక‌ల్‌ మాయిశ్చ‌రైజ‌ర్స్‌ను వాడే బ‌దులు.

ఇంట్లోనే పైన చెప్పిన విధంగా మాయిశ్చ‌రైజ‌ర్‌ను త‌యారు చేసుకుని వాడితే చ‌ర్మానికి ఎంతో మంచిది.

తాజా వార్తలు