చందనంతో ఫేస్ సీరం.. రోజు వాడితే ఊహించని లాభాలు మీ సొంతం!

చందనం పొడి( Sandalwood powder ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇంగ్లీష్ లో శాండల్ వుడ్ పౌడర్ అని పిలుస్తారు.

చందనం పొడి సువాసనకు దాసోహం కానీ వారు ఉండరు.అలాగే చర్మ సౌందర్యానికి చందనం పొడి అందించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.

ముఖ్యంగా చందనం పొడితో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ సీరం( Face serum )ను తయారు చేసుకుని ప్రతిరోజు వాడితే కనుక మీరు ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం చందనంతో సీరం ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ చందనం పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత ఎనిమిది నుంచి ప‌ది టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్, వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు మరోసారి మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన ఫేస్ సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ సీరంను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.

ప్రతిరోజు ఈ సీరం ను వాడటం వల్ల చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయి.ముదురు రంగు మచ్చలు ఉన్న సరే త‌గ్గు ముఖం పడతాయి.

అలాగే చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది. డ్రై స్కిన్ నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం ఆకర్షణీయంగా మారుతుంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

మరియు సన్ టాన్, సన్ బర్న్ వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.కాబట్టి తప్పకుండా చందనంతో పైన చెప్పిన విధంగా ఫేస్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోండి.

తాజా వార్తలు