ఇంట్లోనే బాడీ లోష‌న్ ఎలా త‌యారు చేసుకోవ‌చ్చో తెలుసా?

ముఖం మాత్ర‌మే కాదు శ‌రీరం మొత్తాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపించుకోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.

అందుకోస‌మే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ ర‌కాల బాడీ లోష‌న్ల‌ను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.

కానీ, వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు పెద్ద‌గా ఉండ‌క‌ పోవ‌చ్చు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే న్యాచుర‌ల్ బాడీ లోష‌న్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.

పైగా ఈ లోష‌న్‌ను వాడ‌టం వ‌ల్ల బోలెడ‌న్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా ల‌భిస్తాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ బాడీ లోష‌న్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ప్పు ఉడికించిన వైట్ రైస్‌, అర క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే.

దానిలో మ‌రో గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల షియా బ‌ట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కొకొన‌ల్ అయిల్ వేసుకుని మిల్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న రైస్ జ్యూస్‌, షియా బ‌ట‌ర్‌-కొకొన‌ల్ ఆయిల్ మిశ్ర‌మం, ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, వ‌న్ టేబుల్ స్పూన్ బేబీ పౌడ‌ర్ వేసుకుని హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో థిక్‌గా మారేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఏదైనా బాటిల్‌లో నింపుకుంటే న్యాచుర‌ల్ బాడీ లోష‌న్ సిద్ధ‌మైన‌ట్టే.దీనిని ప్ర‌తి రోజు వాడ‌టం వ‌ల్ల మీ స్కిన్ బ్రైట్‌గా, వైట్‌గా మారుతుంది.

చ‌ర్మంపై ఏవైనా న‌ల్ల మ‌చ్చ‌లు, చార‌లు, ముడ‌త‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు స్కిన్ ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తూ క‌నిపిస్తుంది.కాబ‌ట్టి, ఈ బాడీ లోష‌న్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు