ఇంట్లోనే యాంటీ హెయిర్ ఫాల్ సీర‌మ్ త‌యారు చేసుకోవ‌డం ఎలాగో తెలుసా..?

నిశ్చల జీవనశైలి, స్టైలింగ్ ఉత్పత్తులను ఎక్కువగా వాడ‌టం, సూర్యరశ్మి, పోష‌కాల కొర‌త‌, ఒత్తిడి, ధూమ‌పానం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఎంతో మంది అధిక హెయిర్ ఫాల్ తో బాధ‌ప‌డుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి యాంటీ హెయిర్ ఫాల్ సీరమ్‌లను ఉపయోగించడం ఒక ఉత్త‌మైన మార్గం.

అలా అని వాటి కోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు.చాలా సింపుల్ గా మ‌రియు త‌క్కువ ఖ‌ర్చుతో ఇంట్లోనే యాంటీ హెయిర్ ఫాల్ సీర‌మ్ ( Anti hair fall serum )ను త‌యారు చేసుకోవ‌చ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ( Green tea ).ఆరోగ్యానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది అనుకుంటే పొర‌పాటే అవుతుంది.నిజానికి గ్రీన్ టీతో మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

Advertisement

ముఖ్యంగా జుట్టు సంర‌క్ష‌ణ‌కు గ్రీన్ టీ ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.రసాయన రహితంగా ఉండే గ్రీన్ టీతో మ‌నం యాంటీ హెయిర్ ఫాల్ సీర‌మ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

అందుకోసం ముందుగా ఒక గ్లాస్ వాట‌ర్ లో రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ ఆకులు వేసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.ఆపై గ్రీన్ టీను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చిన్న క‌ప్పు గ్రీన్ టీ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయి( Olive Oil )ల్ మ‌రియు ఐదు చుక్క‌లు పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో మ‌న సీర‌మ్ సిద్ధం అవుతుంది.

ఈ సీరమ్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

యూకేలో భారతీయ మహిళ దారుణహత్య .. బస్టాప్‌లో పొడిచి పొడిచి చంపిన దుండగుడు
పవన్ కళ్యాణ్ ఓజీ డబ్బింగ్ పనుల్లో బిజీ కానున్నారా..?

ఈ గ్రీన్ టీ సీర‌మ్ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఈ సీరమ్ ను వారానికి రెండు సార్లు వాడ‌టం వ‌ల్ల‌ మీ జుట్టు మూలాలు స్ట్రోంగ్ గా మార‌తాయి.

Advertisement

ఫ‌లితంగా హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ క్ర‌మంగా అదుపులోకి వ‌స్తుంది.అలాగే గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

ఇవి మీ స్కాల్ప్‌ను క్లీన్ చేస్తాయి.ఇన్ఫెక్షన్‌ల నుండి విముక్తి క‌ల్పిస్తాయి.

అదే స‌మ‌యంలో మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడానికి సహాయపడుతాయి.

తాజా వార్తలు