ఒంట్లో తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఏం చేయాలి ?

టైఫాడ్, మలేరియా, డెంగ్యూ, లేకోపోనియా .

ఇలాంటి రోగాల బారిన పడిన పేషెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు డాక్టర్లు కామన్ గా చెప్పే విషయం, తెల్ల రక్తకణాలు పడిపోవడం.

నిజానికి ఈ రోగాలు రావడం వలన తెల్లరక్తకణాలు పడిపోవడం కాదు, తెల్లరక్తకణాలు అవసరమైనంత లేకపోవడం వలనే ఈ రోగాలు వస్తాయి.మరి తెల్లరక్తకణాలు తగ్గడానికి ఈ రోగాలు రావడానికి సంబంధం ఏమిటి ? రోగనిరోధకశక్తి అంటే ఏమిటి ? తెల్లరక్తకణాలు ఎక్కువ ఉంటడం.White Blood Cells, అంటే తెల్లరక్తకణాలు మన శరీరాన్ని రోగాలనుంచి కాపాడతాయి.

రోగాలు దాగి చేసినప్పుడు వాటి అంతు చూస్తాయి.అదే తెల్లరక్తకణాల సంఖ్య పడిపోయింది అనుకోండి, రోగాల దాడికి అడ్డుకోవడం కష్టం.

ఒక మైక్రోలీటర్ రక్తంలో 4500 నుంచి 10000 దాక తెల్లరక్తకణాలు ఉండాలి.ఈ సంఖ్యే తగ్గితే ప్రమాదం.

Advertisement
White Blood Cells, Immunity, Vitamin B6, Foods To Increase White Blood Cells-ఒ

అందుకే తెల్లరక్తకణాల సంఖ్య ఎలా పెంచుకోవాలో చూడండి.* ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తినాలి.

ఎందుకంటే ఇవి ఒంట్లో ఫాగోసైట్స్ ని పెంచుతాయి.ఇది కూడా వైట్ బ్లడ్ సెల్స్ లో ఓరకం.

ఇవి ఇన్ఫెక్షన్స్ ని, బ్యాక్టీరియాని అడ్డుకుంటాయి.ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఎక్కువ దొరికే ఆహారాల విషయానికి వస్తే చేపలు, వాల్నట్స్, ఓయ్ స్టర్స్, పాలకూర, సోయా బీన్స్.

* విటమిన్ బి6 తీసుకోవడం వలన కూడా తెల్లరక్తకణాలు పెరుగుతాయని 2011 లో ప్రచురించబడిన ఓ పరిశోధన ప్రకారం విటమిన్ బి6 న్యోట్రోఫిల్ లెవల్స్ ని పెంచుతుంది.తెల్లరక్తకణాల పెరుగుదలకి ఇది ఎంతో కీలకం.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
ఆరెంజ్ వలన అద్భుత లాభాలు

సన్ ఫ్లవర్ సీడ్స్, అరటిపండు, చికెన్, పాలకూర, నట్స్ లో విటమిన్ బి6 బాగా దొరుకుతుంది.* విటమిన్ బి12 కూడా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ని బాగా పెంచుతుంది.

Advertisement

ఈ విటమిన్ ని పొందాలంటే పప్పులు, పెరుగు, చికెన్, సాల్మన్ ఫిష్ బాగా తినాలి.

* ఫోలిక్ ఆసిడ్ ఎక్కువ కలిగిన ఆహారపదార్థాలు తెల్ల రక్త కణాలు పెరిగేందుకు సహాయపడతాయని జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ తెలుపుతోంది.బ్రోకోలి, పాలకూర, నిమ్మ, ఆరెంజ్ లో ఈ ఫోలిక్ ఆసిడ్ దొరుకుతుంది.* జింక్ ఇమ్యునిటిని అమాంతం పెంచుతుంది.

ప్రమాదం రాకముందే, ఇప్పటినుంచే జింక్ ఉండే ఆహారపదార్థాలని తినడం మొదలుపెట్టండి.గుమ్మడికాయ, పుచ్చకాయ, అల్లం, చిక్ పీస్ లో జింక్ లెవల్స్ ఎక్కువ.

* ఇంకా చెప్పాలంటే కాట్స్ క్లా, అస్ట్రాగాలస్, కాపర్ ఉండే పదార్థాలు తింటూనే, కోబ్రా పోస్ లో యోగా చేయండి, రోజూ వ్యాయామం చేయండి అలాగే శుభ్రత పాటించండి.

తాజా వార్తలు