కొబ్బరినూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

ప్రతి ఒక్కరు పెదవులు అందంగా, కాంతివంతంగా, గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటారు.అయితే గులాబీ పెదవుల కోసం ఖరీదైన కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు.

 How To Get The Pink Rose Lips From Dark Black Lips , Dark Black Lips, Cinnamon P-TeluguStop.com

అయినా పెద్దగా ప్రయోజనం కలకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందువల్ల మన ఇంటిలో సులభముగా అందుబాటులో ఉండే పదార్ధాలతో నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

దీనికి కేవలం మూడు పదార్ధాలు అవసరం అవుతాయి.

మొదటిది దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క పొడి నలుపును తొలగించటంలో సహాయపడుతుంది.

ఈ పొడిని వాడటం వలన ఎటువంటి చికాకు ఉండదు.ఈ పొడిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన పెదాల నలుపును తగ్గించటంలో సహాయాపడుతుంది.

రెండోవది బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన పెదాల నలుపును తగ్గించటంలో సహాయాపడుతుంది.

మూడొవది కొబ్బరి నూనె కొబ్బరినూనెలో మాయిశ్చరైజర్ లక్షణాలు ఉండుట వలన పెదాలు పొడిగా మారకుండా తేమగా ఉంచటంలో సహాయాపడుతుంది.

ఒక బౌల్ లో పావు స్పూన్ దాల్చినచెక్క పొడి, పావు స్పూన్ బేకింగ్ సోడా పొడి, అరస్పూన్ కొబ్బరినూనె వేసి బాగా కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే త్వరలోనే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube