సిల్కీ హెయిర్ కావాలా? అయితే మందారాల‌తో ఇలా చేయాల్సిందే!

సాధార‌ణంగా అమ్మాయిల్లో చాలా మంది సిల్కీ హెయిర్‌నే ఇష్ట ప‌డుతుంటారు.అందుకోస‌మే కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్స్‌లో హెయిర్ ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

అయితే న్యాచుర‌ల్‌గా కూడా జుట్టును సిల్కీగా మార్చుకోవ‌చ్చు.అందుకు మందారం పూలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి జుట్టుకు మందారం పూల‌ను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు మందారం పూల రేకుల‌ను తుంచి వాట‌ర్‌లో వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే మెత్త‌గా పేస్ట్ చేసి.అందులో ఒక టేబుల్ స్పూన్‌ మెంతి పొడి మ‌రియు ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు అప్లై చేసుకుని.ముప్పై, న‌ల‌బై నిమిషాల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో త‌ల స్నానం చేయాలి.

మూడు రోజుల‌కు ఒక సారి ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు క్ర‌మంగా సిల్కీగా మారుతుంది.మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే మందారం పువ్వు రేకుల‌ను కొన్ని తీసుకుని.బాగా నూరి పేస్ట్‌లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకుని.

శిరోజాల‌కు ప‌ట్టించాలి.అర గంట పాటు వ‌దిలేసి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆ త‌ర్వాత మామూలు షాంపూ యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

ఇక మందారం పూల‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మందారం పూల పొడి, హెన్నా పొడి, నిమ్మ ర‌సం మ‌రియు కొద్దిగా కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లిపి.

త‌ల‌కు పూయాలి.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాలు పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం త‌ల స్నానం చేసేయాలి.ఇలా చేసినా హెయిర్ సిల్కీగా మ‌రియు షైనీగా మారుతుంది.

తాజా వార్తలు