బ్రహ్మాస్త్ర : రాబట్టింది కొంచెమే.. రాబట్టాల్సింది మాత్రం చాలా ఉందట!

బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేక పోతుంది.

ఈసారి అయినా సాలిడ్ కొట్టాలని అనుకుంది.కానీ ఈసారి కూడా అనుకున్న రేంజ్ లో విజయం సాధించే సూచనలు కనిపించడం లేదు.

ఇటీవలే బాలీవుడ్ నుండి మరొక పెద్ద సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది.ఈ సినిమాపై నార్త్ ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

దీనిని ప్రెస్టీజియస్ గా తీసుకుని ఇటు సౌత్ లో కూడా ప్రొమోషన్స్ చేసారు.ఏకంగా మన అగ్ర డైరెక్టర్ రాజమౌళి ని సమర్పకుడిగా రంగంలోకి దించి సౌత్ ప్రేక్షకులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసారు.

Advertisement

అంతా అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అయితే అందుకుంది.బ్రహ్మాస్త్ర సినిమా ఫస్ట్ డే ఏకంగా 75 కోట్లు రాబట్టి బాలీవుడ్ కు ఊపిరి పోసింది.

వీకెండ్ వరకు ఈ సినిమా బాగానే కలెక్షన్స్ సాధించిన వీకండ్ తర్వాత సోమవారం రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.ఎక్కడో తేడా కొట్టేయడంతో భారీగా వసూళ్లపై ప్రభావం ఏర్పడింది.

మేకర్స్ మాత్రం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి వారంలో 300 కోట్ల గ్రాస్ సాధించింది అని చెబుతున్నారు.

కానీ ఈ లెక్కలు మాత్రం షేర్ అమౌంట్ ప్రకారం అలా లేవు.ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగగా.ఆ మొత్తంలో సగం మాత్రమే రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

మరి ఇంకా సగం మాత్రమే రాబట్టడంలో.ఇంకా రాబట్టాల్సింది చాలానే ఉంది అని తెలియడంతో ఇక ఈ సినిమా నష్టాల పాలు అవ్వకుండా ఆపడం కష్టమే అంటున్నారు.

Advertisement

చూడాలి ఈ సినిమా ఎంత వసూళ్లతో క్లోజ్ అవుతుందో.

తాజా వార్తలు