మెడ నొప్పి వేధిస్తుందా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

మెడ నొప్పిస్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో త‌ర‌చూ వేధించే స‌మ‌స్య ఇది.

కంప్యూట‌ర్లు చూస్తూ గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్ చేయ‌డం, సరైన భంగిమలో కూర్చోక‌పోవ‌డం, ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చోవడం, ఫోన్‌ను అధికంగా వాడ‌టం, పోష‌కాల లోపం, కండ‌రాల బ‌ల‌హీన‌త‌, మారిన జీవ‌శైలి, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మెడ నొప్పి వేధిస్తుంది.

ఆ స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క చాలా మంది పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌తారు.కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సులువుగా మెడ నొప్పిని నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.మెడ నొప్పికి చెక్ పెట్ట‌డంలో యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

రెండు గ్లాసుల గోరు వెచ్చిన నీటిలో రెండు స్పూన్ల‌ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ వాట‌ర్‌లో కాట‌ర్‌లో కాట‌న్ ట‌వెల్ డిప్ చేసి మెడ‌పై అద్దుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే మెడ నొప్పి నుంచి త్వ‌ర‌గా రిలీఫ్ అవుతారు.అలాగే నొప్పిని వేగంగా తగ్గించ‌డంలో ల్యావెండర్ ఆయిల్ ముందుంటుంది.

అందుకే మెడ నొప్పి ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ల్యావెండర్ ఆయిల్‌ను మెడ‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకుంటే ఇట్టే నొప్పి దూరం అవుతుంది.ఐస్ థెరఫీ, హీట్ తెరఫీ చేసుకున్నా మెడ నొప్పి త‌గ్గుతుంది.

చిన్న పాటి మెడ వ్యాయామాలు చేయాలి.మెల్లగా స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మెడ‌ను రొటేట్ చేయ‌డం, వజ్రాసనంలో కూర్చొని నడుము నిటారుగా ఉంచి మెడను తలను నెమ్మదిగా కిందకు వంచి, పైకి లేపడం, కుడి వైపు, ఎడమ వైపు తిప్ప‌డం ఇలాంటివి చేస్తే మెడ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.ఇక మెడ నొప్పి అధికంగా ఉన్న‌ప్పుడు అల్లంను నీటిలో వేసి మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.

ఈ వాట‌ర్‌లో కొద్దిగా తేనె కలిపి సేవించాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మెడ నొప్పి మ‌టుమాయం అవుతుంది.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు