సూర్యాపేట పట్టణంలో హై టెన్షన్...!

సూర్యాపేట జిల్లా: మరికాసేపట్లో సూర్యాపేట బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్( BRS Municipal Chair Person ),వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుండడంతో పట్టణంలో హై టెన్సన్ నెలకొంది.ఉదయం 11:30 గంటలకు అవిశ్వాస సమావేశం ఉండగా ఇంకా కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఏం జరుగుతుందో అర్దం కానీ పరిస్థితి కనిపిస్తుంది.

అయితే ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్ ను దించి వేయాలనుకున్న విపక్ష శిబిరం నుంచి ఓ ఇద్దరు కౌన్సిలర్లు జంప్ అయినట్లు సమాచారం.

మరో ప్రక్క దళిత మహిళా చైర్ పర్సన్ అన్నపూర్ణ( Annapurna )పై అవిశ్వాసం సరికాదని నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో పలువురు దళిత,బహుజన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తుంది.

అవిశ్వాస పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూర్యాపేట మున్సిపాలిటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.సూర్యాపేట జనరల్ స్థానంలో అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) దళిత మహిళ అన్నపూర్ణను చైర్ పర్సన్ చేసిన విషయం తెలిసిందే.

మొత్తం 48 వార్డుల్లో అవిశ్వాసం కోరిన 32మంది కౌన్సిలర్లు.

Advertisement
1000 కోట్ల మార్కును అందుకున్న ఏడుగురు డైరెక్టర్లు వీళ్లే.. వీళ్ల టాలెంట్ వేరే లెవెల్!

Latest Suryapet News