వ‌రంగ‌ల్ లో బీజేపీ స‌భ‌కు హైకోర్టు అనుమ‌తి

వరంగల్ లో బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మ‌కొండ‌ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.

అయితే సభకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో.బీజేపీ నేత‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు.

బీజేపీ నేత‌లు దాఖ‌లు చేసిన‌ లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయస్థానం విచార‌ణ జ‌రిపింది.ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు స‌భ‌కు అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, ఈ బ‌హిరంగ స‌భ‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌రుకానున్నారు.ఈ క్ర‌మంలో స‌భా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్సల్ వ‌రంగ‌ల్ రానున్నారు.

Advertisement
ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?

తాజా వార్తలు