విడాకులు, బ్రేకప్‌ల తర్వాత కూడా దూసుకెళ్తున్న స్టార్‌ హీరోయిన్స్‌

పలువురు ముద్దుగుమ్మలు సౌత్ లో టాప్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు.తమ అందం, అభినయంతో జనాల మనసులు దోచుకుంటున్నారు.

సినీ కెరీర్ పరంగా మంచి ఊపులో కొనసాగుతున్నా.వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా కష్టలతో నిండుకుని ఉంది.

కొందరు ప్రేమ విఫలమై బాధపడితే.మరికొందరు మూడు ముళ్లబంధంతో ఒక్కటై విడిపోయారు కూడా.

పర్సనల్ లైఫ్ బాధలను మర్చిపోయేలా.ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.*

సమంత

Advertisement

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, మలయాళం సినిమా పరిశ్రమలో మంచి హీరోయిన్ గా కొనసాగుతుంది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునంది.అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే తన భర్త నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకుంది.

ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు తీస్తూ తన పెళ్లి బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది.శాకుంతలం సినిమాను కంప్లీట్ చేసుకుంది.

విజయ్ సేతుపతితో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ లో నటిస్తోంది.అటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ 30వ మూవీకి కూడా ఓకే చెప్పింది.

అటు ఓ హాలీవుడ్ సినిమాకు కూడా తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

*నయన తార

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఈ అమ్మడికి బోలెడన్ని ప్రేమకథలు ఉన్నాయి.తొలుత శింబుతో ప్రేమాయణం సాగించి ఈ అమ్మడు.ఆయనతో బ్రేకప్ అయ్యాక మరిన్ని ఆఫర్లు అందుకుంది.పలు సినిమాల్లో నటించింది.

Advertisement

ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించింది.తనను పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి.

కానీ ఆయనతో కూడా రిలేషన్ షిప్ బ్రేకప్ అయ్యింది.ఆ తర్వాత ఈమెకు ఇంకా ఎక్కువ ఆఫర్లు వచ్చాయి.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సౌత్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రస్తుతం దర్శకుడు విష్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతుంది.

*రష్మిక మందాన

ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతోంది.తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లోనూ మంచి పేరు సంపాదించింది.ప్రస్తుతం బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో నటులు, నిర్మాత అయిన రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంతది.కానీ ఆ తర్వాత ఇది క్యాన్సిల్ అయ్యింది.

ఆ తర్వాత తెలుగులో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది.

*మెహ్రీన్

హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఈ అమ్మడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.ఆ తర్వాత వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పింది.

కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమాతో తెలుగులో అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలు చేసింది.

*త్రిష

రెండు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమను ఏలుతుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం చేసుకుంది.కానీ ఎందుకు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తను తమిళంలో బిజీ హీరోయిన్ గా మారింది.

*శ్రుతీ హాసన్‌

కమల్ డాటర్ గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.తొలుత ఐరెన్ లెగ్ అనే పేరు పొందింది.కానీ గబ్బర్ సింగ్ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అదే సమయంలో మైఖేల్ కోర్సలే తో ఆమె ప్రేమలో పడింది. ఎందుకో తెలియదు కానీ ఆ తర్వాత తన ప్రేమ విఫలం అయినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం శాంతనుతో ప్రేమలో కొనసాగుతుంది.

తాజా వార్తలు