టాలెంట్ ఉన్నా ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోని హీరోయిన్లలో రెజీనా కెసాండ్రా( Regina Cassandra ) కూడా ఒకరు.
ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.
అయితే ఓటీటీల హవా పెరగడంతో ఈ బ్యూటీకి వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి.పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా రెజీనాకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
16 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ కొన్ని సినిమాలలో బోల్డ్ రోల్స్ లో నటించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో సైతం నటించి మెప్పించడం గమనార్హం.ఫర్జీ సిరీస్( Farzi Series ) తో తాజాగా ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ లైఫ్ లో వచ్చిన ప్రతి మలుపు సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు.అభిమానులు సెల్ఫీ అడిగితే సెల్ఫీ దిగేంత గొప్ప పని ఏం చేశానని అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.
ఆ ప్రేమను, అభిమానాన్ని చిన్నచూపు చూడొద్దని రెజీనా పేర్కొన్నారు.యాంకర్ గా నా కెరీర్ మొదలైందని గుర్తింపు వచ్చిన ప్రతి మనిషికి బాధ్యతలు పెరుగుతాయని రెజీనా చెప్పుకొచ్చారు.
స్పూర్తిదాయక మహిళల కథలు మరిన్ని రావాలని ఆమె పేర్కొన్నారు.ఖాళీ సమయంలో రొమాంటిక్ నవలలు ( Romantic Novels )చదువుతానని ఆమె కామెంట్లు చేశారు.నా ఫేవరెట్ డ్రింక్ కాఫీ అని కాఫీ తాగితే కొత్త ఎనర్జీ వస్తుందని రెజీనా చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు నాన్ వెజ్ ఇష్టంగా తిన్నానని పెటాలో చేరిన తర్వాత ఆ విషయంలో మారానని రెజీనా చెప్పుకొచ్చారు.
నా స్నేహితులు నన్ను మదర్ ఆఫ్ గ్యాంగ్( Mother of Gang ) అని పిలుస్తారని ఆమె కామెంట్లు చేశారు.నా అనుకునే వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని నేను భావిస్తానని రెజీనా చెప్పుకొచ్చారు.నేను సైకాలజీ( Psychology )లో డిగ్రీ చదివానని మనుషులతో ఓ పట్టాన నేను కనెక్ట్ కానని ఆమె కామెంట్లు చేశారు.
ప్రతి మనిషికి వ్యక్తిత్వం, అస్తిత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు.అడుగులు పెద్దగా వేయాలే తప్ప అక్కడే ఆగిపోకూడదని రెజీనా పేర్కొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy