Pallavi prashanth Rathika : బిగ్ బాస్ సీజన్7.. రైతుబిడ్డ అంటూనే హీరోయిన్ లైన్ లో పెట్టేసాడుగా?

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్( Bigg boss telugu 7 ) సెవెన్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే.

హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఈసారి సీజన్ ఉల్టా పుల్టా గా ఉండబోతోంది అంటూ ఇప్పటికే హోస్ట్ నాగార్జున ఈ షోపై ఆసక్తిని మరింత పెంచిన విషయం తెలిసిందే.నాగ్ అన్నట్టుగానే ఊహించని విధంగా హౌజ్‌ని నడిపిస్తున్నారు.

ట్విస్ట్ టర్న్ లతో తీసుకెళ్తున్నాడు.హౌజ్‌లో ఇంకా ఎవరూ కన్ఫార్మ్ కాలేదని తెలిపారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు పవర్‌ సాధించాలని చెబుతూ, వారికి టాస్క్ లు ఇస్తున్నాడు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Heroine Rathika Fidaa To Raitu Bidda Pallavi Prashanth Love Story Next Level In
Advertisement
Heroine Rathika Fidaa To Raitu Bidda Pallavi Prashanth Love Story Next Level In

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆలస్యం పులిహోర కలపడం మొదలుపెట్టాడు.మొదట్లో అసలు ఏమీ తెలియని అమాయకుడిలా కనిపించిన ప్రశాంత్ మెల్లగా తనలో ఉన్న టాలెంట్ ని బయటపెడుతున్నాడు.రైతు బిడ్డ కావడంతో అందరూ అతనిపై సింపతి చూపించగా ఇప్పుడు అతను ఏకంగా అతని నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాడు.

ఏకంగా హీరోయిన్ తోనే పులిహార కలుపుతున్నాడు.తన ఫోకస్‌ మాత్రం హీరోయిన్‌ రతిక రోజ్‌పై పెట్టాడు.

అయితే మొదటిరోజు బిగ్ బాస్‌ హౌజ్‌లో మేల్‌, ఫీమేల్‌ జంటలుగా ఏర్పడాలనే టాస్క్ పెట్టగా, అందుకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, రతికని ఎంపిక చేసుకున్నారు.తన బ్యాండ్‌ ఆమెకి ఇస్తానని వెల్లడించారు.

ఆమెతో తనతో బాగా మాట్లాడిందని, బాగా నచ్చిందని తెలిపారు.అందరి ముందు ఆ విషయాన్ని చెప్పే రతికని ఇంప్రెస్‌ చేశాడు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఆ తర్వాత కూడా తాను ఎందుకు నచ్చానని అడగ్గా, సిగ్గుపడుతూ ఆమెని ఎందుకు నచ్చిందో తెలిపారు.తనదైన ఇన్నోసెంట్‌ మాటలతో ఆమెని బురిడి కొట్టించాడు.

Advertisement

దీనికి అప్పుడే ఇంప్రెస్‌ అయ్యింది రతిక.

దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.బిగ్‌ బాస్‌ షో స్టార్ట్ అయి రెండు రోజుల్లోనే అప్పుడే ఆమెని పడేశాడు.రెండో రోజుల నీ హార్ట్ ని ఎవరికి ఇస్తావని రతిక, పల్లవి ప్రశాంత్‌ని( Rathika ) అడగ్గా, పెద్ద ప్రశ్నే అంటూ నీ హార్ట్ ని ఎవరికిస్తావని అడగ్గా నీకే ఇస్తా అని ఆమె చెప్పడంతో మనోడి ఆనందానికి అవదుల్లేవు.

ఎగిరి గంతేశాడు.ముసి ముసి నవ్వులతో ఆమెని మరింత ఫిదా చేశాడు.ఆ తర్వాత తన హార్ట్ ని ఆమెకే ఇస్తానని, హార్ట్ లో నువ్వే ఉన్నావని తెలిపాడు.

అంతటితో ఆగలేదు.ఆమె తలని తన హార్ట్ వద్ద ఉంచి ఆ శబ్దం వినిపించాడు.

ఈ దెబ్బకి రతిక పూర్తిగా పడిపోయినట్టుగా రియాక్ట్ అవడం విశేషం.దీంతో మనోడి వేషాలపై అటు హౌజ్‌లో ఇటు బయట పెద్ద చర్చ నడుస్తుంది.

అమాయకుడు అనుకుంటే మహా ముదురులాగే ఉన్నాడని, వచ్చి రావడంతోనే హీరోయిన్‌ని పడేశాడని కామెంట్లు చేస్తున్నారు.ఒకవేళ ప్రశాంత్ కనుక హౌస్ లో ఇలాగే కొనసాగితే ఓట్లు పడడం కష్టమే అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హౌస్ లోకి వెళ్ళింది కేవలం గేమ్ ఆడటం కోసం కప్పు గెలవడం కోసం అంతేకానీ అమ్మాయిలతో పులిహార కలపడడానికి లవ్ లో పడేయడానికి కాదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు