తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS )మూడోసారి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది .దీనిలో భాగంగానే మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపింది .
ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా, ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలని భావించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ ప్రకటనే ఇబ్బందికరంగా మారింది.ఒకేసారి 115 మంది పేర్లను ప్రకటించింది.
వీరిలో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం , టిక్కెట్ ఆశించి బంగపడిన వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని చూసినా, అది రివర్స్ అయినట్టుగా కనిపించింది .

పార్టీ టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్, బిజెపిల( Congress bjp )లో టిక్కెట్ హామీ పొంది ఆ పార్టీలో చేరుతుండడం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది .ఇప్పుడు ఇతర పార్టీలవైపు వెళుతున్న నేతలు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు కావడంతో , నాయకుల వెంట కేడర్ కూడా వెళ్తుందనే భయం బీఆర్ఎస్ లో మొదలైంది.దీంతో అనవసరంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి తప్పు చేసామా అన్న భావన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( CM kcr ) లో కనిపిస్తోంది.ఇక బిజెపి, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అసంతృప్త నేతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా , ఆ పార్టీని బలహీనం చేయాలనే ఆలోచనతో ఆ రెండు పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి.దీంతో బీఆర్ఎస్ మరింతగా టెన్షన్ పడుతోంది.
అభ్యర్థుల టికెట్ విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించినా, కాంగ్రెస్ బిజెపిలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ ( Congress )ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది.బీఆర్ఎస్ నుంచి కీలక నాయకులు చేరుతూ ఉండడంతో టికెట్ల కేటాయింపు అంశంపై పూర్తిగా దృష్టి సారించింది.ఇక బిజెపి విషయానికొస్తే ఆ పార్టీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులు కోరుతోంది .బిజెపి టికెట్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు.టికెట్ల ప్రకటన విషయంలో బీఆర్ఎస్ మాదిరిగా తప్పు చేయకూడదని ఆచితూచి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి అని బీజేపీ,కాంగ్రెస్ లు భావిస్తున్నాయి.