Vishwambara : విశ్వంభర సెట్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వెళ్లారు.

ఇలా రాజకీయాలలో కొంత కాలం పాటు కొనసాగిన చిరంజీవి రాజకీయాలలో ఇమడలేక తన పార్టీనీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి తిరిగి సినిమాలలోకి అడుగు పెట్టారు.ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ వశిష్ట ( Vasista ) దర్శకత్వంలో విశ్వంభర ( Vishwambara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాకి చిరు సరసన ఎవరు నటిస్తారనే విషయం పట్ల ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి హీరోయిన్ అడుగుపెట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు పూల బొకే అందించి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Advertisement

అందుకు సంబంధించినటువంటి వీడియోలను కూడా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఎవరు నటిస్తున్నారనే విషయానికి వస్తే.ఈ సినిమాలో మొదట నుంచి కూడా త్రిష ( Trisha ) పేరు వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే అందరూ అనుకున్న విధంగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు.

తాజాగా ఈమె షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాదాపు 18 సంవత్సరాలు తర్వాత మరోసారి త్రిష చిరంజీవి స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.వీరిద్దరి కాంబినేషన్లో గతంలో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.స్టాలిన్ సినిమా తర్వాత త్రిష చిరంజీవితో కలిసి నటించిన సందర్భాలు లేవు అయితే విశ్వంభర సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఇక త్రిష సినీ కెరియర్ పూర్తి అయింది అనుకున్నటువంటి తరుణంలో ఈమె గ్రాండ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

Advertisement

ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా వార్తలు