Vijay : మరో ప్రభాస్ అవ్వలనుకున్నాడు..కానీ బొక్క బోర్లా పడ్డాడు..!

కొన్నేళ్లు వెనక్కి వెళితే టాలీవుడ్ లో కానీ లేదా సౌత్ ఇండియాలో కానీ తమ సినిమాని సొంత భాషల్లో హిట్ చేసుకోవడమే కానీ నార్త్ కు వెళ్లి బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులపడం అనేది మనవారికి సాధ్యమయ్యే పని కాదు.

కానీ రాజమౌళి ఆ పనిని బాహుబలి( Baahubali ) సినిమా ద్వారా చేసి చూపించాడు.

ఎవరి భాషలో వారు సినిమా తీసుకోవడం పెద్ద విషయం కాదు.కానీ బాలీవుడ్ లో ఆ మాఫియాను తట్టుకొని తమ సినిమాని నిలబెట్టుకోవాలంటే అది కత్తి మీద సాము లాంటిదే.

అయిన కూడా రాజమౌళి కంటెంట్ మీద ఉన్న ధైర్యంతో ఆ పని చేసి చూపించి అందరి ముందు తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు.పైగా పార్ట్ వన్ తో పాటు పార్ట్ 2 కూడా అంతకన్నా మంచి విజయాన్ని అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

అయితే ప్రభాస్ రాజమౌళి ఈ పని చేశారు కాబట్టి అందరూ అలాగే చేస్తాము అనుకుంటే అది సాధ్యం కాదు.పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ప్రభాస్ ని చూసి తమిళ్ స్టార్ హీరో విజయ్( Vijay ) కూడా తమ సినిమాని బాహుబలి కన్నా కూడా గొప్ప సినిమా చేయాలని ఒక ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డాడు.విజయ్ ఆం ఇండియా వ్యాప్తంగా తీసిన మొట్టమొదటి సినిమా పేరు పులి.

Advertisement

ఈ సినిమా బాహుబలి తర్వాతే వచ్చింది.కానీ పులి సినిమాలో బాహుబలి చిత్రంలో లాగానే ప్రభాస్ ని కొంతమేర అనుకరించి విజయ్ తన యాక్టింగ్ స్కిల్స్ తో బాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకుందాం అనుకున్నాడు కానీ అది ఒక పేరడీలా అయిపోయి విజయ్ యాక్టింగ్ ఎవరికి నచ్చలేదు.

దాంతో విజయ్ నటించిన పులి సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.అప్పటితో విజయ్ బాలీవుడ్ ఆశలకు నీళ్లు చల్లినట్టు అయింది.ప్రభాస్ లాగా యాక్టింగ్ చేయాలని విజయ్ కి ఎవరు సూచించారు తెలియదు కానీ ఆ సినిమా బాలీవుడ్ వారికి ఏమాత్రం నచ్చలేదు పైగా బాహుబలి, పులి చిత్రాలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాతో ఉన్నాయి.

దాంతో విజయ్ మళ్ళీ తమిళంలోనే తన సొంత భాషలో సినిమాలు తీసుకుంటున్నాడు. పులి చిత్రం( Puli movie ) తర్వాత మూడు నాలుగు వరస పరాజయాలు సైతం అందుకున్నాడు.

వాటి ప్రభావం విజయ్ కెరియర్ పై గట్టిగా పడింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు