ఆస్కార్ ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సూర్య..!

చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను అందిస్తూ ఉంటారు.అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే వాటిలో ఆస్కార్ అవార్డులు ఒకటి.

ఇలా ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలను ప్రతి ఏటా నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే 2023 మార్చి నెల 12వ తేదీ లాస్ ఏంజెల్స్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుక జరగనుంది.

అయితే ఈ వేడుకలలో భాగంగా విజేతలను ఎంపిక చేయడం కోసం దాదాపు పదివేలకు పైగా ఆస్కార్ ఓటర్స్ ఈనెల రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో వారి ఓటును నమోదు చేయవచ్చు.

ఈ క్రమంలోనే మన ఇండియాలో కూడా కొందరు సెలబ్రిటీలు ఆస్కార్ ఓటు హక్కును కలిగి ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే దక్షిణాదీ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వారిలో నటుడు సూర్య కూడా ఆస్కార్ ఓటు హక్కును కలిగి ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

అకాడమీ క్లాస్ ఆఫ్ 2022 లో భాగంగా సూర్య ఆస్కార్ సభ్యునిగా ఎంపికైన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నటుడు సూర్యతోపాటు బాలీవుడ్ నటి కాజోల్, డైరెక్టర్ స్క్రీన్ రైటర్ రీమా ఖగ్తీలు కూడా ఆస్కార్ మెంబర్స్ గా నిలిచారు.ఇక సూర్య తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇక సూర్య కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈయనకు ఎంతో మంచి ఆదరణ ఉంది.

ఈయన చేసిన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ క్రమంలోనే సూర్య సినిమాలకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది.

ఇక సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నారు.ప్రస్తుత ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు