నలుగురు అమ్మాయిలతో హీరో ప్రేమాయణం.. గుర్తుందా శీతాకాలం ట్రైలర్ చూశారా?

ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ విభిన్న సినిమాలు చేస్తూ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఆయన నాగ శేఖర్ దర్శకత్వంలో, నాగ శేఖర్ రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్న "గుర్తుందా శీతాకాలం" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇందులో హీరోయిన్ గా తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రేమ చిగురిస్తుంది అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుందనే విషయం గురించి ప్రతి ఒక్కరు ఎంతో సందిగ్ధంలో ఉన్నారు.హీరో సత్యదేవ్ ఆయన ఏకంగా ఒకరిని కాదు ఇద్దరు కాదు నలుగురు అమ్మాయిలను ప్రేమించడం వారిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే అయోమయ పరిస్థితుల్లో ఉంటారు.

ఒక్కో దశలో ఒకరిని ప్రేమించిన సత్యదేవ్ చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నారనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే సత్యదేవ్ కి శీతాకాలంలో ప్రేమ పుట్టిందని అందుకే శీతాకాలం అంటే తన లైఫ్లో ఒక మ్యాజిక్ అని ఫీల్ అవుతారు.తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Advertisement

అయితే ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు