మెగా హీరోతో అఖిల్ మల్టీస్టారర్..!

మెగా హీరోతో అఖిల్ మల్టీస్టారరా.ఇంతకీ అఖిల్ తో చేసే మెగా హీరో ఎవరని కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు.

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రిపబ్లిక్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉండగా కార్తికేయ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు త్వరలో వెళ్లనుంది.లేటెస్ట్ గా సాయి ధరం తేజ్ ఓ కథ విన్నాడట అందులో మరో హీరో అవసరం ఉండగా ఆ పాత్రలో అఖిల్ అయితే పర్ఫెక్ట్ అనే భావన కలిగిందట.

అఖిల్ కు కథ వినిపించి ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు.దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సెకండ్ హీరో బాధ్యతని సాయి ధరం తేజ్ తీసుకున్నట్టు టాక్.

ఒకవేళ అఖిల్ చేయనని చెబితే నాగ చైతన్యతో అయినా చేయించాలనే ప్లాన్ లో ఉన్నారు.మొత్తానికి అక్కినేని హీరోతో మెగా హీరో సినిమా దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు.

Advertisement

మరి ఈ సినిమాకు సమబందించిన అప్డేట్ త్వరల్లో తెలుస్తుంది.అఖిల్, నాగ చైతన్య ఇద్దరిలో ఎవరైనా సరే మెగా, అక్కినేని మల్టీస్టారర్ కు సూపర్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

అఖిల్, నాగ చైతన్య ఇద్దరు తమ తమ సినిమాలతో కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.అయితే మెగా హిరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆడియెన్స్ కు సరికొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు