ప్రభాస్ సన్ రూఫ్ వ్యాన్.. ఫీచర్ అదిరిపోయిందిగా!

స్టార్ హీరోలకు ప్రత్యేకంగా వానిటీ వ్యాన్ లు ఉంటాయి.వాటి కోసం హీరోలు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు.

మన టాలీవుడ్ లో కూడా చాలా మందికి వానిటీ వ్యాన్ లు ఉన్నాయి.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లకు కూడా లగ్జరీ వానిటీ వ్యాన్ లు ఉన్నాయి.

కోట్ల రూపాయలతో వీటిని డిజైన్ చేయించు కుంటున్నారు.అంత డబ్బుతో డిజైన్ చేయించుకునే వానిటీ వ్యాన్ లలో అన్ని సదుపాయాలు ఉంటాయి.

వీటిని హీరోల అభిరుచికి తగ్గట్టుగా వాటిని డిజైన్ చేయించు కుంటారు.వీటిలో ఎక్కడికైనా ప్రయాణించే సదుపాయం ఉంటుంది.

Advertisement

ఇక తాజాగా ఈ లిస్టులో ప్రభాస్ కూడా చేరి పోయాడు.ప్రభాస్ కూడా లగ్జరీ వానిటీ వ్యాన్ కొన్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ వానిటీ వ్యాన్ ఇప్పుడు కొన్నది కాదట.ఎప్పుడో కొన్న వానిటీ వ్యాన్ ను ఇప్పుడు కొత్త ఫీచర్లతో మళ్ళీ కొత్తగా డిజైన్ చేయించాడట.

అందులో ఒక ప్రత్యేక ఫీచర్ ను ప్రభాస్ డిజైన్ చేయించాడట.అదే సన్ రూఫ్ ఫీచర్ అని తెలుస్తుంది.ప్రభాస్ కు సహజ లైటింగ్ ఇష్టపడతాడట.

అందుకోసమే అవుట్ డోర్ లొకేషన్స్ షూట్ చేస్తున్నప్పుడు వానిటీ వ్యాన్ లో సహజంగా లైటింగ్ రావడం కోసం ప్రభాస్ ఈ ఫీచర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక ప్రభాస్ ప్రెసెంట్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈనేపథ్యంలో ప్రభాస్ వానిటీ వ్యాన్ పై ఓం రౌత్ కామెంట్స్ చేసాడు.

Advertisement

ప్రభాస్ వానిటీ వ్యాన్ లో ఉన్న సన్ రూఫ్ ఫీచర్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.పనిలో ఉన్నప్పుడు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండడం సూపర్ అంటూ ఓం రౌత్ ట్వీట్ చేసాడు.

తాజా వార్తలు