అబ్బాస్ ఫేమ్ లో లేకుండా పోవడానికి ఇది ఒక కారణమేనా.. శంకర్ పిలిచి అవకాశం ఇస్తే?

టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే.

అంతేకాకుండా శంకర్ దర్శకత్వంలో సినిమా ఆఫర్ వచ్చింది అంటే ఏ హీరో కూడా వదులుకోడు.

అందుకు గల కారణంశంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు అన్నీ కూడా భారీ స్థాయిలో ఉంటాయి.శంకర్ తన సినిమాల్లో కొత్త కొత్త టెక్నాలజీ ని వాడుతూ ఉంటారు.

అందుకే శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కూడా భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.అలాంటి శంకర్ పిలిచి సినిమా ఆఫర్ ఇస్తే ఒక హీరో మాత్రం నో చెప్పాడట.

ఆ హీరో ఎవరో కాదు అబ్బాస్.హీరో కమల్ హాసన్ తో భారతీయుడు సినిమా తీసి మంచి హిట్ అందుకున్న శంకర్ కొంత గ్యాప్ తర్వాత జీన్స్ సినిమా కథను సిద్ధం చేసుకున్నాడు.

Advertisement

ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా కోసం శంకర్ హీరో అబ్బాస్ ని అనుకొని, అబ్బాస్ ను ప్రత్యేకంగా కలిసి మరీ కథను వివరించాడట.

అయితే అప్పటికే హీరో అబ్బాస్ నటించిన ప్రేమ దేశం సినిమా సంచలన విజయం సాధించడంతో సినిమాల పరంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.ఆ సమయంలో దాదాపుగా ఒక పది సినిమాల వరకు కమిట్మెంట్ ఇచ్చాడట.

అందువల్ల శంకర్ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట అబ్బాస్.అంతేకాకుండా దర్శకుడు శంకర్ ఖాతాలో భారతీయుడు సినిమా తప్ప మరొక హిట్ సినిమా లేదు.దీనితో శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అబ్బాస్ సాహసం చేయలేదంటూ వార్తలు వినిపించాయి.

అబ్బాస్ నో చెప్పడంతో దర్శకుడు శంకర్ హీరో అజిత్ ని అనుకున్నాడట.అజిత్ కూడా ఆ సినిమాను మిస్ చేసుకున్నాడు.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

చివరికి ఆ సినిమా స్క్రిప్టు ప్రశాంత్ దగ్గరికి వెళ్లగా అందుకు హీరో ప్రశాంత్ ఓకే చెప్పారు.అలా ఈ సినిమా ఏప్రిల్ 4,1998 లో విడుదల అయింది.

Advertisement

ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో ఐశ్వర్యరాయ్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

తాజా వార్తలు