సింగరేణి ఎన్నికల పిటిషన్ పై విచారణ వాయిదా

సింగరేణి ఎన్నికల పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

ఎన్నికలను ఈనెల 27కు బదులు వచ్చే సంవత్సరం మార్చిలో నిర్వహించాలని పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గానూ సమయం కావాలని యూనియన్ కోర్టును కోరింది.

పోలింగ్ ఏర్పాట్లతో పాటు సిబ్బంది నియామకానికి సమయం కావాలని విన్నవించింది.ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు