వామ్మో.. బఠానీల‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

చాలా మంది ఇష్టంగా తినే ఆహారంలో బఠానీలు ఒక‌టి.చిరుతిండిగా బ‌ఠానీల‌ను ఎక్కువ‌గా తింటుంటారు.

అయితే కేవ‌లం చిరుతిండిగానే కాకుండా.ఆరోగ్య‌ప‌రంగా కూడా బ‌ఠానీల‌తో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

ముఖ్యంగా ప‌చ్చి బ‌ఠానీల‌లో బోలెడ‌న్ని పోష‌కాలు దాగున్నాయి.ప‌చ్చి బ‌ఠానీల‌ను ఇతర కూరగాయలతో క‌లిపి ర‌క‌ర‌కాల వంట‌లు త‌యారు చేస్తారు.

ఎలా చేసినా.ప‌చ్చి బ‌ఠానీల టేస్ట్ అద్భుతంగా ఉంటుంద‌ని చెప్పాలి.

Advertisement
Health Benefits Of Green Peas! Health Tips, Green Peas, Health, Latest News, Gre

ఇక ప‌చ్చి బ‌ఠానీల వ‌ల్ల ఏ ఏ ప్ర‌యోజ‌నాలు పొందొచ్చో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్పులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకోవాలంటే.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

అయితే యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండే ప‌చ్చి బ‌ఠానీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌.రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే మ‌ధుమేహ రోగుల‌కు ప‌చ్చి బ‌ఠానీలు బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి.

Health Benefits Of Green Peas Health Tips, Green Peas, Health, Latest News, Gre
భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఎందుకంటే.ఫైబ‌ర్ అధికంగా ఉండే ప‌చ్చి బ‌ఠానీలు తీసుకోవ‌డం వ‌ల్ల. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

Advertisement

కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్న ప‌చ్చి బ‌ఠానీలు తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.ఎముకులు, దంతాలు దృఢంగా మార‌తాయి.

అలాగే ప‌చ్చి బఠానీల్లో మాత్ర‌మే దొరికే పాలీఫెనాల్.అనేక రకాల క్యాన్సర్లను రాకుండా ర‌క్షిస్తుంది.

ఇక ప‌చ్చి బఠానీలు త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధకం మ‌రియు ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా ప‌చ్చి బ‌ఠానీల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

ఎందుకంటే.ప‌చ్చి బఠానీలు శ‌రీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌‌ను క‌రిగిస్తుంది.

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే ప‌చ్చి బ‌ఠా‌నీ గర్భిణీలకు కూడా మేలు చేస్తుంది.

తాజా వార్తలు