చ‌లి కాలంలో గోంగూర తింటే ఏం అవుతుందో తెలుసా?

చ‌లి కాలం ప్రారంభం అయింది.చలి తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ.

జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ అవుతుంటాయి.

ముఖ్యంగా ఈ సీ‌జ‌న్‌లో జలుబు, దగ్గు, ఫ్లూ, వైర‌ల్ జ్వ‌రాలు వంటి స‌మ‌స్య‌లు అత్య‌ధికంగా ఉంటాయి.

అందుకే, చ‌లి కాలం స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఆరోగ్యంపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ఇక ఈ వింట‌ర్ సీజ‌న్‌లో శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అలాంటి ఆహారాల్లో గోంగూర ఒక‌టి.ఆకుకూర‌ల్లో ఒక‌టైన గోంగూరతో మన భార‌తీయులు ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు.

Advertisement

గోంగూర ప‌చ్చ‌డి, గోంగూర చికెన్‌, గోంగూర మ‌టన్‌‌, గోంగూర ప‌ప్పు ఇలా ఎన్నో రుచిక‌ర‌మైన వంట‌లు చేస్తారు.అయితే రుచిలోనే కాదు.

ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ గోంగూర ముందుంటుంది.ముఖ్యంగా ఈ కాలంలో గోంగూర తీసుకోవ‌డం వ‌ల్ల.

శ‌రీరంలో వేడి పుట్టి చ‌లిని త‌ట్టుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది.అలాగే చ‌లి కాలంలో రోగాల బారిన ప‌డ‌కూడ‌దు అని అనుకుంటే.

ఖ‌చ్చితంగా వారానికి క‌నీసం ఒక‌టి లేదా రెండు సార్లు అయినా గోంగూర తీసుకోవాలి.ఎందుకంటే, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే విట‌మ‌న్- సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు గోంగూర‌లో పుష్క‌లంగా ఉంటాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఇక ఈ చ‌లి కాలంలో ఎముక‌లు పెలుసుగా మారుతుంటాయి.అయితే గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల‌.

Advertisement

అందులో ఉండే క్యాల్షియం మ‌రియు ఇనుము ఎముక‌ల‌ను, కండ‌రాల‌ను బ‌లంగా మారుస్తుంది.అదేవిధంగా, దగ్గు మ‌రియు ఆయాసం స‌మ‌స్య‌లు ఉన్న వారు గోంగూర తీసుకుంటే.

త్వ‌ర‌గా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.గోంగూర‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

గోంగూర తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా క‌రుగుతుంది.ఫ‌లితంగా గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె జ‌బ్బులకు దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు