చ‌లికాలంలో బొప్పాయి తింటే.. ఈ బెనిఫిట్స్ అన్నీ మీవే!

ప్ర‌స్తుతం చ‌లి కాలంకొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా తెగ ఇబ్బంది పెడుతుంటాయి.

అందుకే వింట‌ర్‌లో ఆరోగ్యంపై, చ‌ర్మంపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఈ సీజ‌న్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హెల్తీగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని పండ్ల‌ను తీసుకోవాలి.

వాటిలో బొప్పాయి ఒక‌టి.అవును, చ‌లి కాలంలో ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో బొప్పాయి పండు తీసుకుంటే.

బోలెడ‌న్ని బెనిఫిట్స్ పొందొచ్చు.అవేంటో ఇప్పుడు ఓ లుక్కేసేయండి.

Advertisement

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, జ్వరం వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.అయితే రెగ్యుల‌ర్‌గా బొప్పాయి తీసుకుంటే.

అందులో ఉండే విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుతాయి.ఫలితంగా సీజ‌న‌ల్‌గా వ‌చ్చే రోగాల‌కు దూరంగా ఉండొచ్చు.

బొప్పాయి తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాల్లో శ్వాససంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.

అలాగే బొప్పాయిలో కేల‌రీలు త‌క్కువ‌గా.ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.అందువ‌ల్ల, బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో బొప్పాయిని తీసుకుంటే.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక ఈ చ‌లి కాలంలో చ‌ర్మం త‌ర‌చూ పొడిబారిపోయి.

Advertisement

డ్రైగా మారుతుంటుంది.అయితే బొప్పాయి తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్ ఇ మ‌రియు ఇత‌ర పోష‌కాలు.

పొడి చ‌ర్మాన్ని మృదువుగా, య‌వ్వ‌నంగా మారుస్తుంది.అదేవిధంగా, నీర‌సం మ‌రియు అల‌స‌ట స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు ప్ర‌తి రోజు బొప్పాయి తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో బొప్పాయి పండు స‌హాయ‌ప‌డుతుంది.ఇక చాలా మంది నోటి పూత స‌మ‌స్య‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డ‌తారు.

అయితే బొప్పాయి తీసుకుంటే.అందులో ఉండే విట‌మిన్ బి నోటి పూత స‌మ‌స్య‌ను గ్రేట్‌గా నివారిస్తుంది.

తాజా వార్తలు