టవల్ కట్టుకునికి కాలేజీకి వెళ్లాడు.. ఎక్కడ జరిగిందంటే?

నేటి తరం విద్యార్థులు ఎలా వున్నారో అందరికీ తెలిసిందే.

తల్లిదండ్రులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, ఇంకా వారికి ఏదో లోటు అన్నట్టు ప్రవరిస్తూ అదికావాలని, ఇది కావాలని వారిని వేధిస్తూ వుంటారు.

ముఖ్యంగా మంచి మంచి బట్టలు, స్మార్ట్ ఫోన్, మోటారు సైకిల్. వీటిలో ఏది తక్కువ అయినా బుంగమూడి పెడుతూ వుంటారు.

ఇలాంటి రోజుల్లో కూడా ఓ ఆ అబ్బాయికి ఇవేమీ అక్కర్లేదు.ముఖ్యంగా మంచిమంచి బ్రాండెడ్ బట్టలు అక్కర్లేదు.

ఒక అండర్ వేర్, టవల్ ఉంటే చాలు.ఏంటి ఆశ్చర్యంగా వుందా? మీరు విన్నది నిజమే.మధ్యప్రదేశ్లోని బర్వానీకి చెందిన ఓ యువకుడి రియల్ స్టోరీ వింటే, చిన్నప్పుడు చూసిన జంగిల్ బుక్ సినిమాలోని మోగ్లీ పాత్ర మీకు గుర్తుకు వస్తుంది.

Advertisement
He Tied A Towel And Went To College Where Did It Happen, Towel , Anjaneya, Viral

వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్లోని బర్వానీకి చెందిన పిచోరి గ్రామానికి చెందిన కన్నయ్య అవాసీకి బట్టలు ధరించడం అస్సలు ఇష్టం ఉండదట.అందుకే స్కూల్ యూనిఫాం వేసుకోకుండా.ఓ చెడ్డీ, టవల్ మాత్రమే ఒంటికి చుట్టుకొని రోజు పాఠశాలకు వెళ్తున్నాడు.

ఇక అతగాడు చదువుతున్నది చిన్న చదువేమి కాదు.ప్రస్తుతం కన్నయ్య బిఎ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

He Tied A Towel And Went To College Where Did It Happen, Towel , Anjaneya, Viral

కన్నయ్య ఇంటర్ తరువాత కాలేజీ చదువులకు వెళ్లాలనుకున్నప్పుడు.బట్టలు వేసుకోవాల్సిందేనని కాలేజీ యాజమాన్యం హుకూం జారీ చేయడంతో దిక్కు తోచని పరిస్థితులలో చేసేదేమీ లేక చదువు మానేయాలనుకున్నాడట.అయితే ఆఖరికి కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాత కాలేజీలో ప్రవేశం అతగాడికి లభించింది.

ప్రస్తుతం కన్నయ్య BA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.కాలేజీలో జాయిన్ అయితే దుస్తులు ఖచ్చితంగా వేసుకోవలసి వస్తుందేమోనని పదో తరగతి తర్వాత చదువు మానేయాలని అనుకున్నాడట.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్

అయితే, దీనికి ఉపాధ్యాయులు అంగీకరించకపోవడంతో చాలా శ్రమపడి కాలేజీలో చేరాడు కన్నయ్య.కాగా ఈ కన్నయ్య వాళ్ళ క్లాస్ లోనే టాప్ ప్లేసులో వున్నాడట!.

Advertisement

తాజా వార్తలు