ఓరి దేవుడా: ఇలాంటి ఎలుకల వర్షాన్ని ఎప్పుడైనా చూసారా..?!

నీటి బిందువులు లేదా మంచు గడ్డలు వర్షంలా పడటం మనం చూసుంటాం.కానీ ఎలుకలు వర్షంలా పడటం మీరెప్పుడైనా చూశారా? నిజానికి ఇది వర్షం కాదు.

కానీ రైతులు పండిస్తున్న పంటకు నష్టం చేస్తున్నాయని ఎలుకల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలా ఏరివేసింది.

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో రైతులు ఎలుకల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు.ఎలుకలు వారి పంటల్ని నాశనం చేస్తున్నాయి.మరోవైపు ఆస్ట్రేలియాలో ప్లేగు వ్యాధి విజృంభిస్తోంది.

ఆ వ్యాధి వ్యాప్తికి కూడా ఎలుకలే కారణం కావడంతో అక్కడి ప్రభుత్వం ఎలుకల్ని ఏరివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.ఓ రైతు తన పంటను ఎలుకలు నాశనం చేస్తున్నాయని అధికారులకు తన సమస్యను తెలిపాడు.

ఆ రైతు విజ్ఞప్తి మేరకు అక్కడి అధికారులు అతడి పొలానికి వెళ్లి చూశారు.ఆ పొలంలో ఓ గుంత తవ్వగా వేల సంఖ్యలో ఎలుకలు కనిపించాయి.

Advertisement

దీంతో వారు ఆశ్చర్యపోయారు.వాటిని ఓ యంత్రం సాయంతో పొలానికి దూరంగా తీసుకొచ్చి బయటకు విడిచిపెట్టారు.

ఆ యంత్రంలో నుంచి ఎలుకల్ని వదలగా అవి వర్షంలా కిందకు పడ్డాయి.ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌కు చెందిన జర్నలిస్ట్‌ లూసీ థాకరే ట్విట్టర్ లో షేర్‌ చేయగా అది వైరల్ అయ్యింది.

ఎలుకల వర్షం’ అంటూ పోస్టు చేసిన ఆ వీడియోలో వరి కోత మిషన్ లాగా ఉన్న యంత్రంలోంచి ఎలుకలు బయట పడుతున్నాయి.ఎలుకలు అక్కడి గోదాముల్లోని ధాన్యాన్ని పాడుచేస్తున్నాయి.

ఇన్ని విధాలుగా దేశానికే ప్రమాదంగా మారుతున్న ఎలుకలను నివారించడంపై ఆ దేశ ప్రభుత్వం దృష్టి పెట్టింది.

వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!
Advertisement

తాజా వార్తలు