ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించినా జగన్ ప్రభుత్వం మరో పక్క కరోనా రోగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు.
తిరుపతి రుయా హాస్పిటల్ ఘటన తర్వాత రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఎక్కడ ఏర్పడకుండా నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా గతంలో అనేక మార్లు ప్రధాని మోడీ కి వ్యాక్సిన్ విషయంలో లెటర్ రాసిన జగన్.
తాజాగా మరో లెటర్ రాసి రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని కోరారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో 30 వేలకు ఆక్సిజన్ పడకల సంఖ్య ఇటీవల పెంచడం జరిగిందని .ఇందుకోసం 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని జగన్ లెటర్లో స్పష్టం చేశారు.రాష్ట్రంలో స్టోరేజ్ లేకపోవడంతో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అదనంగా వంద మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా తమిళనాడు ఇంకా ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ రావడంలో.
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అందువల్ల తిరుపతి రుయా హాస్పిటల్ ఘటన జరిగినట్లు పదకొండు మంది మృతి చెందినట్లు తెలిపారు. ఏది ఏమైనా పెంచిన బెడ్స్ పరంగా ఆక్సిజన్ కొరత రాష్ట్రంలో లేకుండా కేంద్రం సహాయం చేయాలని లెటర్లో మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.