ఈటల పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు.. ?

సింహం సింగిల్‌గా వస్తుంది.పందులే గుంపులుగా వస్తాయని శివాజీ సినిమాలో రజనీకాంత్ వదిలిన డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది.

ఇక కేసీఆర్ కూడా ఒక డైలాగ్ వదిలారు.ఈ బక్కపలచని మనిషిని ఎదుర్కోవడానికి ఢీల్లీ నుండి పెద్ద పెద్ద నేతలు దిగితున్నారని.

ఈ రెండింటికి దగ్గరి సంబంధం ఉండగా, ఈ డైలాగ్‌లు హుజురాబాద్ ఉప ఎన్నికకు సింక్ అవుతున్నాయి.అదేమంటే ఈటల ఒక్కడు.

కానీ టీఆర్ఎస్ మాత్రం సింహంలా వేటాడడానికి సమాయత్తం అవుతుంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో కేవలం ఈటలను ఓడించడానికి తీవ్రంగా వలసలను ప్రోత్సహిస్తుందట.

Advertisement
Trs Harish Rao Sensational Comments On Etela Rajender, Harish Rao, Sensational C

ఈ క్రమంలో ఇల్లంతకుంటకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్ 200 మంది పార్టీ కార్యకర్తలతో నిన్న హైదరాబాద్‌లో హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర సమక్షంలో టీఆర్ఎస్‌ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో హరీష్ రావు ఈటల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trs Harish Rao Sensational Comments On Etela Rajender, Harish Rao, Sensational C

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక తర్వాత హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ నుంచి విముక్తి లభిస్తుందని, కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు