ఫలిస్తున్న ఆపరేషన్ ఈటెల ? చక్రం తిప్పుతున్న హరీష్ ? 

తెలంగాణలో ఈటెల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు టిఆర్ఎస్ అధినాయకత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు.

ఇప్పటికే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో, ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం కానీ, లేక సొంత పార్టీ పెడతారని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది.

ఈ సమయంలో తెలంగాణ లో రాజకీయంగా బలపడకుండా చేయడంతోపాటు, ఆయనకు అనుకూల పరిస్థితులు లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఈటెల రాజేందర్ తెలంగాణలోని వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు అందర్నీ కలుస్తూ , తన భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

ఈ  వ్యవహారాలను చాలా జాగ్రత్తగా టిఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది.అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో మంత్రి హరీష్ రావు వంటి వారిని కెసిఆర్ రంగంలోకి దించారు.

 ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఇప్పటికే ఈటెల విషయంలో సక్సెస్ అవుతున్నట్లుగా వ్యవహారాలు చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్,  కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా కమలాపూర్ మండల్ పరిషత్ అధ్యక్షులు శ్రీకాంత్,  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సంపత్ రావు , కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ కృష్ణప్రసాద్,  మండల రైతు బంధు అధ్యక్షుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కుమార్ స్వామి తదితరులు మంత్రులతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు మొత్తం పార్టీ అడుగు జాడల్లోనే నడుస్తాం అని ఈటల రాజేందర్ వైపు వెళ్లడం లేదనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.వీరే కాకుండా మండల గ్రామ స్థాయి నాయకులు సైతం ఈటల రాజేందర్ వైపు వెళ్ళకుండా హరీష్ రావు,  వినోద్ కుమార్ తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నారు.అలాగే  హుజురాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు అందరితోనూ నిత్యం టచ్ లో ఉంటూ ఈటల కు అనుకూల పరిస్థితులు ఏర్పడకుండా మంత్రి హరీష్ రావు, వినోద్ లు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చినా, రాకపోయినా సొంత నియోజకవర్గంలో ఆయనకు బలం లేకుండా చేయడం ద్వారా , ఆయన ప్రభావం పెద్దగా ఉండదు అనే సంకేతాలను ఇచ్చేందుకు టిఆర్ఎస్ అధిష్టానం ఈ విధంగా ఎత్తుగడ వేస్తున్నట్లు అర్థం అవుతోంది.

రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు