కులవృత్తులకు చేయూత - 42 మంది లబ్ధిదారులకు బీసీ బందు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: కులవృత్తులకు బీసీ బందు చేయూత లాంటిదని లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన బీసీ బందులో భాగంగా రెండో విడతగా 42 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష విలువైన చెక్కులను ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్ పి టి సి లక్ష్మణ్ రావు లతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తులు చేసుకునేవారు పెట్టుబడి సహాయంతో ఆర్థికంగా బలపడాలని లబ్ధిదారులకు సూచించారు.గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందును అమలు చేసిందని పేర్కొన్నారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ కు ఓటు వేసి గెలిపించి ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతను చాటుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News