గ్రూపు-1పరీక్షను నిలిపివేయాలని హాల్ టికెట్స్ దహనం...

నల్లగొండ జిల్లా

:ఇటీవల టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష( Group 1 Exam ) పత్రం లీకేజీ వ్యవహారం తేలకుండా, నూతన బోర్డును నియమించకుండా,అదే కమిటీతో మళ్ళీ పరీక్షను నిర్వహించడం దుర్మార్గపు చర్యని స్వేరో స్టూడెంట్స్ యూనియన్( Students Union ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో( Anumula Suresh Swero ) అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంధాలయ కార్యాలయం వద్ద స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలోగ్రూపు-1 పరీక్షను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించి,అభ్యర్థుల హాల్ టికెట్స్ ను దహనం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పుడున్న టీఎస్పిఎస్సి బోర్డును రద్దు చేసి,నూతన బోర్డు ఎన్నిక తరువాతనే గ్రూప్ -1 పరీక్షను నిర్వహించాలని, లేకుంటే రాష్ట్రంలో ఉద్యమం పెద్ద ఎత్తున లేవనేత్తి రానున్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తామని హెచ్చరించారు.స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎల్లప్పుడూ విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.యు నాయకులు రమేష్,జానీ,రాశేఖర్, సందీప్,శంకర్,బద్రి, మరియు అనేక మంది నిరుద్యోగులు పాల్గొన్నారు.

నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠా అరెస్ట్...!
Advertisement

Latest Nalgonda News