Pet Cat Hair Cut: వైరల్: పిల్లికి హెయిర్ కటింగ్, ట్రిమ్మింగ్ చేయించిన ఓనర్... నవ్వులే నవ్వులు!

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో ఏమాత్రం నచ్చినవి వున్నా క్షణాల్లో నెటిజన్స్ వాటిని వరాల చేస్తూ వుంటారు.

ముఖ్యంగా ఫన్నీగా వున్న వీడియోలకు ఇక్కడ మంచి గిరాకీ ఉంటుంది.అదేనండి.

ప్రమోషన్ లాగా అన్నమాట.ఇప్పుడు అలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూస్తే "పనిలేని మంగలోడు పిల్లి ఈకలు గొరిగాడట!" అన్న సామెత ప్రతీ ఒక్కరికీ గుర్తొస్తుంది.ఎందుకంటే ఇక్కడ హెయిర్ కట్ చేసే అతను ఆ మాటను నిజం చేసాడు మరి.ఈ సామెత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందుకు చర్చనీయాంశం అయిందో తెలియాలంటే మీరు ఇక్కడ వున్న వీడియో చూసి తీరాల్సిందే.ఇక్కడ ఈ సామెతకు తగ్గ అసలైన ఘటన జరిగింది.

Advertisement

అవును, వీడియోలో వున్న ఓ వ్యక్తి పిల్లికి హెయిర్ కట్ చేయడం వీడియోలో చూడవచ్చు.ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతోంది.

హెయిర్ డ్రెస్సర్ కి ఓ బుల్లి పిల్లి కస్టమర్ గా మారింది.ఇంకేముంది, మనిషికి చేసినట్టుగానే దానికి కూడా చాలా శ్రద్ధగా హెయిర్ కట్ చేస్తూ, పైగా దాని మీసాలను ట్రిమ్ చేస్తూ వీడియోలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే బేసిగ్గా ఇలాంటి జీవులకు అలా ఎవరైనా కటింగ్ చేస్తే తెగ అల్లరి చేస్తాయి.కానీ ఈ మార్జాలం అలా చేయలేదు .వీడియోలో కనిపించే తెల్లటి పిల్లి ఏ మాత్రం కదలకుండా బుద్ధిగా కటింగ్ చేయించుకుంటుంది.సదరు హెయిర్ డ్రెస్సర్ కటింగ్ చేస్తూ ఉంటే పిల్లి హాయిగా సేద తీరడం మనం గమనించవచ్చు.

ఇక ఈ వీడియో చూసి ఎంతో మంది నేటిజన్లు అవాక్కవుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసి తరించండి.మీకు అనిపించింది కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!
Advertisement

తాజా వార్తలు